Take a fresh look at your lifestyle.

2020‌ని కాటేసిన కొరోనా మహమ్మారి

కొరోనా వైరస్‌ ‌వలన మిలియన్ల ప్రజలు కష్టాలపాలయ్యారు. లాక్‌డౌన్‌ ‌తో ఉద్యోగం
ఉపాధి కోల్పోయారు. జీతాల్లో కోతలు, విద్యాలయాలు తెరవని కారణంగా లక్షల మంది ఉపాద్యాయులు/అధ్యాపకులు ఇళ్ళకు వెళ్ళారు. ఆన్‌లైన్‌ ‌బోధనలతో విద్యార్థినీ విద్యార్థుల కొత్త ఇక్కట్లుమెదలయ్యాయి.  తాజాగా, ప్రపంచాన్ని సరికొత్త కరోనా స్ట్రేయిన్‌ ‌భయపెట్ట సాగింది.

2020 సంవత్సరం కొద్ది రోజుల్లో చరిత్రలో కలుస్తుంది. గడచిన ఏడాదిలో ఎన్నో ముఖ్య ఘటనలు జరిగినా కరోనా సృష్టించిన కల్లోలం ముందు అన్నీ చిన్న విషయాలే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ‌విజయం, ఆస్ట్రేలియా కార్చిచ్చులో 47 మిలియన్‌ ఎకరాలు బూడిద కావడం, బ్రిటీష్‌ ‌రాయల్‌ ‌కుటుంబాన్ని ప్రిన్స్ ‌హారీ, మేఘన మార్కెల్‌ ‌వదిలి వెళ్ళడం, డొనాల్డ్ ‌ట్రంప్‌ అభిసంశణ విచారణ, పారాసైట్‌ ‌సినిమాకు ఆస్కర్‌ ఆవార్డు, అమెరికాలో వర్ణవివక్ష తో జార్జ్ ‌ఫ్లాయిడ్‌ ‌హత్య, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ‌జాంగ్‌ ఉన్‌ ‌మరణ పుకారు, కరోనా టీకాల అభివృద్ధి వంటి ముఖ్య ఘటనలు అంతర్జాతీయంగా చోటు చేసుకున్నాయి. ఇక దేశంలో ప్రధమ చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌గా జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌నియామకం, అతి పెద్ద ఎత్తైన సర్దార్‌ ‌వల్లబ్‌బాయ్‌ ‌పటేల్‌ ‌విగ్రహావిష్కరణ, సిఏఏ బిల్లు, అయోధ్యలో రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌ ‌కుమార్‌ ‌ప్రభుత్వం, డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారత పర్యటన, ఇండో చైనా సరిహద్దు వివాదంలో సైనికుల మరణం, చైనీస్‌ ‌యాప్‌ల నిషేధం… వీటిని మించి కరోనా మహమ్మాలి విశ్వ మానావాళిని అతలాకుతలం చేసిన చేదు అనుభవాలు వెంటాడుతున్నాయి.

గత డిసెంబర్‌ ‌లో చైనా వూహాన్‌ ‌లో కరోనా వైరస్‌ ‌ప్రారంభమైంది కోవిడ్‌-19 ‌గా నామకరణం జరిగిన వైరస్‌ ‌ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించి, కోట్ల మందికి సోకి మిలియన్ల మంది ప్రాణాలను మింగింది. అనేక విశ్లేషణల అనంతరం 2020 జనవరి12న డబ్ల్యూహెచ్‌ఓ ‌కరోనా వైరస్‌ను నిర్థారించింది. జనవరి 30న కేరళలో ప్రథమ కరోనా కేసు నమోదుకాగా, 12 మార్చి 12 న మ్నెదటి కోవిడ్‌ ‌మరణం నమోదైంది. కరోనా అక్టోబరు-2020 నాటికి తీవ్రరూపం దాల్చింది. నేటికి ఇండియాలో కోటి కేసులు దాటగా దాదాపు 1.5 లక్షల మరణాలు సంభవించాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేర న మార్చ్ 22‌న కరోనా బంద్‌ను పాటించగా, కేంద్రం మార్చి 24 నుండి 03 మే వరకు పూర్తి లాక్‌డౌన్‌ ‌విధించింది. మే 17 నుండి లాక్‌డౌన్‌ ‌సడలింంపులు మొదలయ్యాయి. జూన్‌ 1‌న లాక్‌డౌన్‌ ‌పూర్తిగా తొలగించి, సామాజిక దూరం పాటించాలనే షరతు పెట్టింది. కరోనా కట్టడిలో భారత్‌ ‌చొరవను డబ్ల్యూహెచ్‌ఓ ‌కొనియాడింది. డిసెంబరు 20నాటికి కరోనా కేసుల సంఖ్య 1 కోటి దాటగా, కోవిడ్‌-19 ‌కారణ మరణాలు 1,45,136 నమోదైనాయి. డిసెంబర్‌ 24 ‌నాటికి దేశంలో 16.5 కోట్ల కరోనా పరీక్షలు చేయగా 1 కోటికి పైగా పాజిటివ్‌ ‌కేసులు బయట పడ్డాయి.

- Advertisement -

కరోనా వైరస్‌ ‌వలన మిలియన్ల ప్రజలు కష్టాలపాలయ్యారు. లాక్‌డౌన్‌ ‌తో ఉద్యోగం ఉపాధి కోల్పోయారు. జీతాల్లో కోతలు, విద్యాలయాలు తెరవని కారణంగా లక్షల మంది ఉపాద్యాయులు/అధ్యాపకులు ఇళ్ళకు వెళ్ళారు. ఆన్‌లైన్‌ ‌బోధనలతో విద్యార్థినీ విద్యార్థుల కొత్త ఇక్కట్లుమెదలయ్యాయి. తాజాగా, ప్రపంచాన్ని సరికొత్త కరోనా స్ట్రేయిన్‌ ‌భయపెట్ట సాగింది. యూకేలో ప్రారంభంయమైన కొరోనాతో కావడంతో అన్ని దేశాలుజాగ్రత్తలు తీసు కొంటున్నాయి. కరోనా కల్లోలంతో ఆర్థికంగాఎక్కువ ప్రభావితమైన 15 దేశాల్లో భారత్‌ ‌కూడా ఉంది.

కరోనా కాలంలోమరణించిన ప్రముఖ భారతీయుల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ, యస్‌ ‌పి బాలసుబ్రహ్మణ్యం, రిషీ కపూర్‌, ఇర్ఫాన్‌ ‌ఖాన్‌, ‌నిషికాంత్‌ ‌కామత్‌, ‌పండిట్‌ ‌జస్రాజ్‌, ‌చేతన్‌ ‌చౌహాన్‌, ‌సుశాంత్‌ ‌సింగ్‌ ‌రాజ్‌పూత్‌, ‌జగ్‌దీప్‌, ‌బాసు చటర్జీ, వాజిద్‌? ‌ఖాన్‌ ‌తదితరు లున్నారు. కరోనా కమ్మిన చీకట్లు ఎప్పుడు తొలుగు తాయో తెలియని స్థితిలో మానవాళి ఉంది. త్వరలోనే కరోనాను కట్టడి చేసే దీటైన టీకా రావాలని, మానవాళి జీవితం పూర్వ స్థితికి చేరాలని కోరుకుందాం.

Dr. Burra Madhusudan Reddy Recipient of the National Best Faculty Award, Retired Principals, Government Degree PG, College Karimnagar
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply