కొరోనా కారణంగా 17 శాతం పెరుగవచ్చని ఐఎంఎఫ్ అంచనా
కొరోనా కారణంగా ఈ ఏడాది భారత ప్రభుత్వ రుణ భారం 17 శాతం పెరిగి జీడీపీలో 90 శాతానికి చేరవచ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 1991 నుంచి ఇప్పటివరకు భారత రుణభారం జీడీపీలో 70 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
కొవిడ్-19 కారణంగా క్షీణించిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రభుత్వ వ్యయాలు పెంచడం, పన్ను ఆదాయాల క్షీణత కారణంగా ఈ ఏడాది అది 17 శాతం పెరిగి జీడీపీలో 90 శాతానికి చేరవచ్చునని తమ అధ్యయనంలో తేలిందని ఐఎంఎఫ్ ఆర్థిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ విటార్ గాస్పర్ చెప్పారు. అయితే 2021లో రుణ భారంలో స్థిరత్వం ఏర్పడి 2025 నాటికి క్రమంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొరోనాకు స్పందనగా ప్రభుత్వ వ్య యాలను పెంచడం భారతదేశం ఒక్క దానికే పరిమితం కాదని ఆయన అన్నారు.