Take a fresh look at your lifestyle.

నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న: బండారి లక్ష్మా రెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, దొరల అరాచకాలను, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 373వ జయంతి సందర్భంగా ఈసిఐఎల్ చౌరస్తా లో గౌడ జేఏసి రాష్ట్ర కో కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మా రెడ్డి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 300 ఏళ్ల క్రితమే సామాన్యుడు సైతం రాజు కావచ్చని నిరూపించిన గొప్ప రాజు సర్వాయి పాపన్న అన్నారు. నిజాంను ఎదురించిన ధీరుడు భరతమాత ముద్దుబిడ్డ  చత్రపతి శివాజీకి సమకాలికుడు బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు అభ్యుదయ సమసమాజ స్థాపకుడు, బహుజన రాజ్యాధికార ప్రతీక పాపన్న చరిత్ర  నేటి తరానికి ఆదర్శప్రాయం అన్నారు. ఈ ఈసిఐఎల్ లో ఏర్పాటు చేయబోయే పాపన్న గౌడ్ విగ్రహానికి తన పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి మొఘల్ సామ్రాజ్యన్ని గడగడలాడించి గోల్కొండ కోటను  ఏలిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు, ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే పాపన్న గౌడ్ విగ్రహానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్ని వర్గాల ప్రజలకు పాపన్న ఆదర్శప్రాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళ ఆనంద్ గౌడ్, కోశాధికారి బుడంపల్లి నిరంత్ గౌడ్, నేమురి మహేష్ గౌడ్, బిజేవైఎం రాష్ట్ర నాయకుడు వి. సందీప్ యాదవ్, కుషాయిగూడ గౌడ సంఘం నాయకులు తాళ్ళ వెంకటేష్ గౌడ్, పంజాల శ్రీనివాస్ గౌడ్, బుడంపల్లి రఘుపతి గౌడ్, శ్రీ నూతన గౌడ సంఘం ప్రదాన కార్యదర్శి మిట్టపల్లి విజయ్ గౌడ్, తెరాస నాయకులు కనక రాజ్ గౌడ్, నారెడ్డీ రాజేశ్వర్ రెడ్డి, బిక్షపతి గౌడ్, రాజు వంశరాజ్, అంజి గౌడ్, బుడంపల్లి వెంకటేష్ గౌడ్, అర్జున్ గౌడ్, జంపాల్ రెడ్డి,పట్టపర్ల ప్రశాంత్ గౌడ్, మధు గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply