Take a fresh look at your lifestyle.

జెర ‘‘భద్రం’’ బిడ్డా..!

అసలే ఇది జనారణ్యం బిడ్డా..!
మానవ రూప మృగాళ్ళుంటాయు
కామం నెత్తికెక్కి కలెదిర్గుతుంటాయి
ఆడది కనబడితే చాలు చెరబట్టి
నాలుక తెగ్గోసి , వెన్నెముక విరిచి
మర్మాంగం కుళ్లబొడిచి చంపుతాయి
ఇక్కడ  అడిగే నాధులెవరు ఉండరు
చట్టాలున్నా వాళ్ళకు చుట్టపు చందం
న్యాయ వ్యవస్థ కళ్ళున్న కబోధి వైనం
ఇది మనువాద రాజ్యం
మతోన్మాద ఏలికలున్న దేశం
కూసింత భద్రంగుండు బిడ్డా !
ఇక్కడ  ఎవ్వరిని నమ్మబోకు…
నమ్మి ఏమరుపాటుగా ఉండబోకు
అమాయకంగుంటే బలిపశువు తీరే
ఇప్పటికిప్పుడు…
నీ చూపులు చురకత్తుల్లా మెరువాలే
నాడుల్లో నవ చేతనం నింపుకోవాలే
నరాల్లో ఉద్రేక రుదిరం పారించాలే
గుండెల్లో తెగువతనం పొదుపుకోవాలే
అడుగుల్లో సింహ నాదం వినిపించాలే
మొత్తంగా దేహం అమ్ములపొది గావాలే
నిన్ను చేరబట్ట జూసే కామోన్మాదులపై
తుపాకీ తూటలా గర్జించాలే
మర పిరంగిలా నిప్పులు చిమ్మాలే
మందు పాతరలా పేలి…
ఆ దేహల తునాతునకలు జెయ్యాలే
ఆడది ఆన్న మాట వింటే అరెకరం తడిచేలా …
వాళ్ళ గుండెల్లో పెను విధ్వంసం సృష్టించాలే
(హాత్రాస్‌ ‌రేప్‌ ‌ఘటనలో బలైన వాల్మీకి అశ్రు నివాళిఅర్పిస్తూ. .)

 – కోడిగూటి తిరుపతి, 9573929493

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply