Take a fresh look at your lifestyle.

వానల తెలంగాణా ..!

  • తడిసి ముద్దవుతున్న హైదరాబాద్‌ ‌నగరం
  • అప్రమత్తంగా ఉండాలి…బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక
  • నేటి వరకు విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్‌ ఆదేశాలు
  • అవసరమైతే సైనిక హెలికాప్టర్ల వినియోగానికి ఆదేశాలు
  • కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద….దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
  • మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు : వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణ చరిత్రలో అత్యంత రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ములుగు జిల్లా వాజేడులో ఈనెల 19 తరవాత మళ్లీ గడచిన 24 గంటలలో 51.5 సెం.వి•ల వర్షం పడింది. గత 24 గంటలలో ములుగు జిల్లా వెంకటాపూర్‌ ‌మండలం లక్ష్మీదేవిపేటలో 64 సెం.వి•ల వర్షం పడింది. గత 24 గంటలలో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.వి• పైన వర్షపాతం నమోదు కాగా, 200ల కేంద్రాల్లో 10 సెం.వి•ల పైగా వర్షం పడింది. రెండు రోజుల క్రితం నిజామాబాద్‌ ‌జిల్లాలో 45 సెం.వి•ల వర్షపాతం నమోదైంది. బుధవారం నుంచి ఉమ్మడి కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ అధికారులను అప్రమత్తంగా ఉండాలని, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైతే హెలికాప్టర్లను కూడా తరలించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

పాఠశాలలకు శుక్రవారం వరకు సెలవులు పొడిగించారు. పోలీసు శాఖ సహాయక చర్యల్లో పాల్గొనాలని డిజిపి ఆదేశించింది. వాగులు వంకలు పొంగడమే గాకుండా ప్రాజెక్టులు నిండి పొంగుతున్నాయి. కృష్ణా, గోదావరి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. హన్మకొండ పట్టణం నీట మునిగింది. సాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వర్షంలో తడిసి ముద్దవుతున్నది. గురువారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ‌నగరానికి హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ‌కె.నాగరత్న హైఅలర్ట్ ‌ప్రకటించారు. గంటకు 5 సెం.వి•. నుంచి 6 సెం.వి•. వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. నగరంలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది.

బుధవారం సాయంత్రం ప్రారంభమైన వాన తెల్లవార్లు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నది. మారేడుపల్లి, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, ‌జవహర్‌ ‌నగర్‌, ‌బొల్లారం, సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌, ‌సీతాఫల్‌మండి, కుత్బుల్లాపూర్‌, ‌నాగోల్‌, ఎల్బీనగర్‌, ‌వనస్థలిపురం, హయత్‌ ‌నగర్‌, ‌దిల్‌సుఖ్‌నగర్‌, ‌మలక్‌పేట, చాదర్‌ఘాట్‌, ‌కోఠీ, నాంపల్లి, లక్డీకాపూల్‌, ‌ఖైరతాబాద్‌, ‌పంజాగుట్ట, అవి•ర్‌పేట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్‌, ‌చందానగర్‌, ‌లింగంపల్లి, మాదాపూర్‌, ‌గచ్చిబౌలి, రాయదుర్గం, బంజారాహిల్స్, ‌జూబ్లీహిల్స్, ‌మెహదీపట్టం, చాంద్రాయణగుట్ట, సాగర్‌ ‌రింగ్‌రోడ్డు, బీఎన్‌రెడ్డిలో భారీ వర్షం కురుస్తున్నది. వర్షాల ధాటికి నాగోల్‌లోని అయ్యప్ప కాలనీలో ఇండ్లలోకి వరద నీరుచేరింది. లింగపల్లి రైల్వే అండర్‌పాస్‌ ‌వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచి పోయాయి. గచ్చిబౌలి-లింగంపల్లి మార్గాల్లో వెళ్లాల్సిన వాహనాలను ట్రాఫిక్‌పోలీసులు దారిమళ్లిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భార్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలతో జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా వొచ్చిన నీటిని వొచ్చినట్లే పోయేట్లు చూస్తున్నారు.

డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బీఆర్‌కే భవన్‌ ‌వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో వర్షం పరిస్థితులపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ అధికారులతో సవి•క్ష నిర్వహించనున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుత పరిస్థితులు, అందుతున్న సహాయక చర్యలపై మేయర్‌ ‌విజయలక్ష్మి, జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌రోనాల్డ్ ‌రోస్‌లతో కలిసి సవి•క్షించనున్నారు. ఇక వర్షాల విషయానికి వొస్తే మరో రెండు రోజుల పాటు భాగ్యనగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్‌ఎం‌సీ అధికారులు అప్రమత్తం చేశారు. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో 10 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని సార్లు అత్యంత వేగంగా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 21 డిగ్రీల మధ్య ఉంటాయని చెప్పింది. ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 14 కిలోవి•టర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ అధికారులు సూచించారు. నిన్నటి నుంచి హైదరాబాద్‌లో ముసురు పడుతుంది.

కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద….దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. భారీగా వరద ప్రవాహం వొస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి వొచ్చిన నీటిని వొచ్చినట్లే వొదిలేస్తున్నారు. అయినప్పటికీ వరద పెద్దఎత్తున్న వొస్తుండటంతో ప్రాజెక్టుపై నుంచి నీరు వెళ్తున్నది. కడెం జలాశయానికి 3.85 లక్షల క్యూసెక్కుల వరద వొస్తుండగా, 2.42 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుగా ఉంది. జలాశయానికి భారీగా వరద వొస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, కడెం ప్రాజెక్టుకు వద్దకు మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్‌, ‌కలెక్టర్‌ ‌వరుణ్‌ ‌రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సవి•క్షిస్తున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇప్పటికే 12 గ్రామాలకు చెందిన సుమారు 7 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు : వాతావరణ శాఖ హెచ్చరిక
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వర్షంలో తడిసి ముద్దవుతున్నది. గురువారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ‌నగరానికి హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ‌కె.నాగరత్న హై అలర్ట్ ‌ప్రకటించారు. గురువారం రాత్రి గంటకు 5 సెం.వి•. నుంచి 6 సెం.వి•. వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కాగా, తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోవి•టర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ‌ప్రకటించింది. నిర్మల్‌, ‌వరంగల్‌, ‌హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌- ‌మల్కాజిగిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిజామాబాద్‌, ‌జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది.

Leave a Reply