Take a fresh look at your lifestyle.

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ ‌భేటీ

  • రెవెన్యూశాఖ ప్రక్షాళన, పంచాయితీ వ్యవస్థ బలోపేతం
  • అవినీతికి ఆస్కారం లేని పాలనపై
  • దిశానిర్దేశం చేసే అవకాశం

- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మంగళవారం ఉదయం 11గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని కలెక్టర్లందరితో సమావేశం కానున్నారు.గ్రామపంచాయతీ ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన తర్వాత నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశం కావడంతో ఈ సదస్సుకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం ఇటీవల అనేక అంశాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారని దగ్గరి వాళ్ల నుంచే వార్తలు వస్తున్నందున నేడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడంలో చాలా పదు నుగా మాట్లాడు తారని అంటున్నారు.రాష్ట్ర ప్రభు త్వం పంచాయతీ వ్యవస్థ చట్టానికి, మున్సిపల్‌ ‌చట్టానికి మార్పులు, సవరణలు చేసింది. ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలనని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పవర్‌ ‌వివాదంలో తొమ్మిదిమంది సర్పంచ్‌లపైన వేటుపడింది. ప్రతీ సందర్భంలో టీఆర్‌ఎస్‌ ‌వాళ్లు తప్పు చేసినా ఉపేక్షించనని సీఎంహెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అవినీతిని అణచివేసేందుకు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించనున్నారు.

 

జాయింట్‌కలెక్లర్ల వ్యవస్థను రద్దుచేసి అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌వ్యవరస్థను తీసుకొచ్చి, ప్రతీజిల్లాకు ఇద్దరు అడిషనల్‌ ‌కలెక్టర్లను ఇచ్చి జీవో జారీ చేశారు. అడిషనల్‌ ‌కలెక్టర్ల విధులు,విధానాలపైన చర్చ జరుగనున్నట్లు సమాచారం.అందుచేత ఈ భేటీ కీలకభేటీగా టీఆర్‌ఎస్‌ ‌వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వచ్చే బడ్జెట్‌సమావేశాల్లో రెవెన్యూ చట్టానికి మార్పులు చేయన్నుట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టతను ఇచ్చారు.ఈ చట్టంలో ఎటువంటి సంస్కరణలను చేస్తారనే విషయాలను ఉపోద్ఘాతంగా సీఎం వివరించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. చట్టానికి ఎటువంటి మార్పులు అవసరమనే విషయాలను కూడా కలెక్టర్లతో చర్చించి సూచనలు స్వీకరించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని ఇవ్వాలనే సంకల్పంతో మిషన్‌భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు.

Leave a Reply