Take a fresh look at your lifestyle.

ప్రతాప్ సాహిత్య సేవలు  ప్రశంసనీయం పద్మశ్రీ ఆచార్య కొలకలూరి  ఇనాక్

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:  ప్రఖ్యాత గుర్తింపు పొందిన  అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ (పూర్వ) సభ్యులు, గుర్రం జాషువా కవి అవార్డు గ్రహీత, డా. బోయి భీమన్న జీవిత సాఫల్య పురస్కార గ్రహీత, అక్షర తపస్వి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో వేడుకలు నిర్వహించనున్నారు.  సోమవారం ప్రోగ్రాం కన్వీనర్ కొల్లి రమావతి  ఆధ్వర్యంలో డిసెంబర్ 16, 17 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బుద్దాల కన్వెన్షన్ హాల్లో 30 గంటలపాటు నాన్ స్టాప్ గా నిర్వహించే ప్రపంచ తెలుగు సాహిత్య కళాఉత్సవాల బ్రోచర్ ను  సాహిత్య  అకాడమీ చైర్మన్ (పూర్వ) పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి మండ ప్రతాప్ ను, ప్రతాప్ సాహిత్య సేవలను అభినందిస్తు  ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ శ్రీ శ్రీ కళావేదిక కల్చరల్ వింగ్ డైరెక్టర్ డేబా విజయ్ కుమార్, జాతీయ కార్యదర్శి  ఎర్ర సతీష్, సోషల్ మీడియా ప్రతినిధి నల్లా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply