Take a fresh look at your lifestyle.

ఆదివాసీల సంక్షేమమే జిల్లా పోలీసుల లక్ష్యం

-సమాజ సేవలో  జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్
పినపాక, ( కరకగూడెం) మార్చి 26 (ప్రజాతంత్ర విలేకరి): అసలే మావోయిస్టు ప్రభావిత జిల్లా, ఏమాత్రం ఖాళీ సమయం దొరకని పరిస్థితి. ఓ వైపు శాంతి భద్రతల పరిరక్షణ,మరో వైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం.
జిల్లా బాస్ గా క్షణం తీరిక ఉంటే చాలు,అటవీ ప్రాంతంలో గిరిజన ప్రజల సంక్షేమం కోసం ఏమి చేయాలని ఆలోచన కల్గిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్  తమకు తోచిన విధంగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వలసలు వచ్చిన ఆదివాసీ కుటుంబాలకు చేయూతను అందిస్తున్నారు. శుక్రవారం  కరకగూడెం మండలం లోని అశ్వాపురం పాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ ఫిల్టర్ ల పంపిణీ కార్యక్రమంలో కరకగూడెం మండలం లోని 3 ఆదివాసీ గ్రామాలు  అశ్వాపురం పాడు,నీలాద్రి పేట గండి మరియు ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివాసీ గ్రామాలు  చింతల పాడు, టేకుల గూడెం, ఇప్పల గుంపు మొత్తం 6 ఆదివాసీ గ్రామాలకు చెందిన వలస గిరిజన కుటుంబాలకు ఇంటికొక వాటర్ ఫిల్టర్ ల ను  అందజేశారు .త్వరలో మిగితా గ్రామాలకు చెందిన వలస ఆదివాసీ కుటుంబాలకు కూడా వాటర్ ఫిల్టర్స్ ను పంపిణీ చేస్తామని తెలిపారు.
ఆదివాసీలకు సురక్షిత నీరు అందించేందుకు ఈ ఫిల్టర్లు పంపిణీ చేశామని చెప్పారు.వీటిని సద్వినియోగం చేసుకొని అంటు వ్యాధులు రాకుండా కాపాడుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ గిరిజన యువత చెడు మార్గంలో నడవకూడదనే ఉద్దేశంతో యువత పలు రకాల క్రీడాల్లో పాల్గొనాలని తెలిపారు.జిల్లాలో గిరిజన వలస ఆదివాసీల సంక్షేమం కోసం పోలీసుశాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ  తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ఏఎస్పీ డాక్టర్ పి. శబరిష్ ఐపీఎస్,ఏడూళ్ళ బయ్యారం సీఐ డి. రమేష్,కరకగూడెం ఎస్.ఐ జి. ప్రవీణ్ కుమార్, ఏడుళ్ళ బయ్యారం ఎస్.ఐ టి.వి.వి.సూరి, ఆర్.ఎస్.ఐ జె. సురేందర్ మరియు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ సిబ్బంది మరియు సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply