Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌చర్యలు సరిపోవు

  • లక్షణాలు కనిపించిన వారిని ఐసోలేట్‌ ‌చేయాలి
  •  అందరికీ కరోనా పరీక్షలు చేపట్టాలి
  • డబ్ల్యూహెఛ్‌వో ఛీఫ్‌ ‌టెడ్రోస్‌ అథనమ్‌
  • ‌ప్రియాంక పాటకి ఫిదా అయిన టెడ్రోస్‌

ప్రపంచ దేశాలు కరోనాను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్‌లు ప్రకటిస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కరోనాను ఎదుర్కోవాలంటే లాక్‌డౌన్‌ ‌చర్యలు సరిపోవని, దీనిపై మరింత దూకుడుగా వ్యవహరించాలని, ఈ సమయంలోనే కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెఛ్‌వో ఛీఫ్‌ ‌టెడ్రోస్‌ అథనమ్‌ ‌సూచించాడు. లాక్‌డౌన్‌ ‌సమయంలోనే వైరస్‌ ‌పై అటాక్‌ ‌చేయాలని, లక్షణాలు కనిపించిన వారిని గుర్తించి ఐసోలేట్‌ ‌చేయాలని సూచించారు. కోవిడ్‌19 ‌నియంత్రణకు కేవలం లాక్‌డౌన్‌ ‌చర్యలు సరిపోవన్నారు. ఆ మహమ్మారిని రూపుమాపాలంటే మరింత దూకుడుగా వ్యవహరించాలన్నారు. కోవిడ్‌19 ‌నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

కోవిడ్‌19 ‌రోగులను గుర్తించాలి, వారిని ఐసోలేట్‌ ‌చేయాలి, అందరికీ కరోనా పరీక్షలు చేపట్టాలి, వారికి చికిత్స ఇవ్వాలంటూ టెడ్రోస్‌ ‌తెలిపారు. సామాజిక, ఆర్థిక ఆంక్షలతో పాటు కఠిన నియమాలు పాటిస్తేనే కోవిడ్‌19‌ను ఎదుర్కోగలమన్నారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌ ‌లాంటి చర్యలను చేపట్టాయని, కానీ మహమ్మారి వైరస్‌లను తరిమేందుకు ఈ చర్యలు సరిపోవని టెడ్రెస్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ‌సమయంలోనే వైరస్‌పై అటాక్‌ ‌చేయాలని కూడా అన్ని దేశాలకు పిలుపు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను విస్తరించాలని, పబ్లిక్‌ ‌హెల్త్ ‌వర్క్‌ఫోర్స్‌ను పెంచుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. కమ్యూనిటీ స్థాయిలోనే అనుమానిత కేసులను గుర్తించే వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన వైద్య పరికరాల ఉత్పత్తిని, సామర్ద్యాన్ని పెంచుకోవాలన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టెడ్రోస్‌ అధనామ్‌ ‌గెబ్రయెసుస్‌ ఇటీవల సరికొత్త ఛాలెంజ్‌ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే .

ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన వారు చేతులని శుభ్రంగా కడుక్కోవడంతో పాటు మరో ముగ్గురు లేదా నలుగురికి ఛాలెంజ్‌ ‌విసరాలి. టెడ్రోస్‌ ‌ముందుగా ప్రియాంక చోప్రా, ఆర్నాల్డ్, ‌మోడల్‌ ‌క్రిస్టి టర్లింగ్టంన్‌లని కూడా నామినేట్‌ ‌చేశారు. ఈ ఛాలెంజ్‌ని ఇప్పటికే దీపికా స్వీకరించగా, తాజాగా ప్రియాంక చోప్రా యాక్సెప్ట్ ‌చేసింది. నేను సేఫ్‌ ‌హ్యాండ్స్ ‌సవాలును అంగీకరిస్తున్నాను . కరోనా నుండి రక్షించు కోవడం కోసం తీసుకోవలసిన ప్రధాన మార్గం చేతులను సరిగ్గా కడగడం. ఇలా చేస్తే ప్రాణాలని కాపాడుకోవచ్చు అంటూ నిక్‌ ‌జోనాస్‌, ‌పరిణితీ చోప్రా, అమితాబ్‌ ‌బచ్చన్‌, ‌కేట్‌ ‌బాస్‌వర్త్, ‌మైండీ కలింగ్‌లకి ఈ ఛాలెంజ్‌లు విసిరింది ప్రియాంక. అయితే సేఫ్‌ ‌హ్యాండ్స్ ‌సవాలుని స్వీకరించిన ప్రియాంక చోప్రా పాట పాడుతూ చేతులని శుభ్రపరచుకుంది. ఈ వీడియోని సోషల్‌ ‌డియాలో షేర్‌ ‌చేయగా, దీనిపై టెడ్రోస్‌ ‌స్పందించారు.డబ్ల్యూహెచ్‌వో జనరల్‌ ‌డైరెక్టర్‌ ‌టెడ్రోస్‌ అధనామ్‌ .. ‌ప్రియాంక వీడియోని షేర్‌ ‌చేస్తూ .. రు ఎక్కడ ఉన్నా చేతులని శుభ్రంగా కడుక్కోండి. ఇది చాలా సులువైన పని. నా కోసం, కోసం ఈ పని చేయండి. రు పాడిన హ్యాండ్‌ ‌వాషింగ్‌ ‌సాంగ్‌ ‌చాలా నచ్చింది. కరోనా తరిమికొట్టే ప్రయత్నంలో రు మాతో భాగస్వామ్యులు కావడం సంతోషంగా ఉందని టెడ్రోస్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy