Take a fresh look at your lifestyle.

వరద నీరు పారుతుండటంతో పోలీస్ స్టేషన్ కు పోయే దారిలోరాకపోకలు బంద్ ..

*కాల్వలు కబ్జా ,,వర్షం నీరు పరుగులు పెట్టే దెట్లా..
*నీట మునిగిన విశ్వ ‘ఖ్యాతి ..
   రాష్ట్ర వ్యాపితంగా గత  రెండు మూడు  రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా వ్యాపితంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి షాద్ నగర్ లో  భారీగా వర్షాలు కురుస్తున్నాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా  పాటు కాల్వలు, నాలాలు, ప్రభుత్వ భూములు  కబ్జాకు గురయ్యాయి ఫలితంగా వర్షం నీరు పారేందుకు సరైన మార్గాలు లేకుండా పోయాయి. నందిగామ మండలంలోని ప్రముఖ  విశ్వ విద్యాలయం (సింబయసిస్) యూనివర్సిటీ    నీట మునిగింది ,ఇప్పటికే వరద తాకిడికి యూనివర్సిటీ  గోడ కూలిపోయింది , పాటు కాలువల స్థానంలోనే వాటిని నిర్మించారన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు  ఏకంగా ప్రభుత్వ పాటు కాలువలు నక్ష బాటలను కబ్జా చేసి వాటిస్థానాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేశారు దాంతో వర్షపునీరు పారెందుకు దారులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యనికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది  ఇక చౌదర్ గూడ మండల కేంద్రానికి వెళ్లే దారిలో వాగు పారడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది అర్ధరాత్రి చడీ చప్పుడు లేకుండా వర్షం బీభత్సం సృష్టించింది ఈ నేపథ్యంలో సింబయసిస్ యూనివర్సిటీలో వందలాది మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉంటారు  ఇంతకన్నా బలమైన వరద ప్రభావం వచ్చి పడితే జరగరని ప్రమాదాలు జరిగితే బాద్యులు ఎవరనేదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న వర్ష తాకిడికి  కొన్ని ఇండ్లు కూలిపోతున్న పరిస్థితి ఉంది , రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు..

Leave a Reply