Take a fresh look at your lifestyle.

అన్ని రాష్ట్రాల సిఎంలు అభినందింస్తుంటే.. ఉచిత టీకాపై కెసిఆర్‌ ‌బాధపడుతున్నారు

  • కమీషన్‌ ‌లేకుండా పోయిందని ఆయన బాధ
  • బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శ
  • టీకా వేస్టేజిలో తెలంగాణ టాప్‌: ‌బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌

మోడీ ఉచిత టీకా ప్రకటనను మెచ్చుకొని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారని, కానీ సంస్కారం లేని కేసీఆర్‌ ‌మాత్రం సైలెంట్‌గా ఉన్నాడని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్‌ ‌యాడ పన్నాడో కూడా తెలియదు. 2500 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రజలకు టీకా వేస్తామని ప్రకటించాడు. ప్రధాన మంత్రి మోడీ అందరికీ ఫ్రీగా టీకా వేస్తామని ప్రకటించడంతో మరి 2500 కోట్లు ఎటు పోయినయి? జూన్‌ 21 ‌నుంచి వ్యాక్సినేషన్‌ ‌పక్రియ స్టార్ట్ అవుతుంది. వ్యాక్సిన్‌ ‌కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్రంలో సిబ్బంది కొరత ఉంది. వసతులు కూడా లేవు. 500 కోట్లతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌తో పాటు హాస్పిటళ్లలో సేవల కోసం పర్మినెంట్‌ ‌సిబ్బందిని కూడా నియమించాలి. మోడీ ఫ్రీ టీకా ఇస్తామంటే సంతోష పడాల్సింది పోయి కేసీఆర్‌కు బాగా బాధ అవుతుందన్నారు. 2500 కోట్లలో తనకు కవి•షన్‌ ‌రాకుండా పోయిందని బాధపడుతున్నాడు. తన కుటుంబానికి ఏవి• మిగలడం లేదనే బాధలో కేసీఆర్‌ ఉన్నాడు.

కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు’ అని ఆయన అన్నారు. బీసీలు, దళితులకు టీఆర్‌ఎస్‌లో గౌరవం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం ఆయన మిడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. కేంద్రమంత్రిగా కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే.. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ఈనెల 13 లేదా 14న నడ్డా సమక్షంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌బీజేపీలో చేరతారని చెప్పారు. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌ను కంట్రోల్‌ ‌చేయటంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జీవన్‌రెడ్డి అంటే తనకు అభిమానమన్నారు. ఈటల ఇండిపెండెంట్‌గా పోటీచేయాలనటం..కాంగ్రెస్‌ ‌పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కోవిడ్‌ను కంట్రోల్‌ ‌చేయలేకే మంత్రి కేటీఆర్‌ ‌కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని బండి సంజయ్‌ ‌ధ్వజమెత్తారు.

టీకా వేస్టేజిలో తెలంగాణ టాప్‌ : ‌బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌
‌కేంద్ర ప్రభుత్వం పంపిన టీకా వేస్టేజ్‌లో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ‌విమర్శించారు. 17.8 శాతం వ్యాక్సిన్‌ ఉపయోగం లేకుండా పోతోందన్నారు. నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌ ‌విషయంలో మంత్రి కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అర్వింద్‌ ..‌వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రంపై విమర్శలు చేస్తావా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీకి సలహాలు ఇచ్చేంత వాడివయ్యావా అంటూ ఫైర్‌ అయ్యారు. రాత్రి 8 తర్వాత సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు మాట్లాడుతాడో ఇప్పటికే ప్రజలకు తెలుసన్న ఎంపీ అర్వింద్‌..ఇప్పు‌డు కేటీఆర్‌ ‌కూడా రాత్రి 8 గంటల తర్వాతనే మాట్లాడుతున్నారన్నారు. నేషనల్‌ ‌మిడియా కవర్‌ ‌చేసేప్పుడు.. తండ్రి, కొడుకు రాత్రి టైంలోనే ఎందుకు మాట్లాడుతున్నారో తెల్సుకోవాలన్నారు. ‘ట్విట్టర్‌ ‌మిద ఆగం చేసే చిన్న పిట్టల దొరా, ఆ దేశం ఈ దేశం గురించి నీ మేథో మధనం తర్వాత చేయొచ్చు..ముందు తెలంగాణకి ఇచ్చిన టీకాలను వేస్ట్ ‌చేయకుండా ప్రజలకు చేరే మార్గం చూడు..నువ్వు మి నాన్న కాస్త పదార్థాల మత్తులో నుండి బయట పడి యదార్థాలను మాట్లాడండి’ అని అర్వింద్‌ ‌వ్యంగ్యంగా అన్నారు.

Leave a Reply