Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఆర్‌ ‌ఖమ్మం జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు

ఖమ్మం జిల్లా : ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ ‌ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ ‌భవన సముదాయాన్ని సందర్శించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసే సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు వెంట స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌, ‌ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.

Leave a Reply