Take a fresh look at your lifestyle.

వ్యవసాయ సంస్కరణలు భారత భవిష్యత్‌ ‌చరిత్రకు కొత్త మలుపు

భారతదేశ చరిత్రలో 1991ని ఒక చారిత్రక మలుపుగా మనం గుర్తు చేసుకుంటుంటాం. అప్పట్లో లైసెన్సుల రాజ్యం కూల్చ బడింది. అంతర్జాతీయ వాణిజ్యానికి, పెట్టు బడులకు పోటీ తత్వానికి వీలుగా భారత్‌ ‌తన విపణుల తలుపులు తెరిచింది. ఫలితంగా అప్పటినుంచీ గడచిన 30 ఏళ్లలో మన తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. అయితే, స్వాతంత్య్రం సిద్ధించిన నాటినుంచి 1991 సంస్కరణల మధ్య దాదాపు 40 ఏళ్ల వ్యవధిలో మన తలసరి ఆదాయం రెట్టింపు కావడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. తలసరి ఆదాయంలో వ్యత్యాస వృద్ధి శాతాలే ఇందుకు నిదర్శనం. కానీ, అయితే, ఒక ముఖ్యమైన సమూహాన్ని మన సంస్కరణల ప్రక్రియకు వెలుపలే వదిలేశాం. ఆ మేరకు భారత వ్యవసాయ రంగం నిరంకుశ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ‌కమిటీ (ఏపీఎంసీ) చట్టాల నియంత్రణ కోరల్లో ఉండిపోయాయి. ఈ పరిస్థితుల నడుమ భారత ఆర్థిక చరిత్రలో 1991తో పోల్చదగిన మరో చారిత్రక మలుపుగా 2020ని ఇకపై గుర్తుంచుకుంటాం. ఎట్టకేలకు భారత వ్యవసాయ రంగం సంకెళ్లు తెంచుకుని, ఆధునికీకరణ బాటపట్టడమే ఇందుకు కారణం.

ప్రస్తుత ఏపీఎంసీ చట్టాల కింద అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ మండీలద్వారానే సాగుతుంది. ఇందుకోసం రైతులు తాము పండించిన పంటలను ఆ మండీలకు రవాణా చేయాల్సి ఉంటుంది. ఆదిలో రైతు రక్షణకు ఉద్దేశించిన ఈ చట్టాలు, మండీలు క్రమంగా స్థానిక గుత్తాధిపత్యానికి ప్రతిరూపాలయ్యాయి. పంటకు మంచి ధర లభించేందుకు ఉద్దేశించిన పారదర్శక వేలం విధానం కాస్తా కుమ్మక్కై ధర నిర్ణయించే పద్ధతిగా మారిపోయింది. అందుకే రైతుకు తీవ్ర నష్టం కలిగించే పద్ధతులకు చరమగీతం పాడి, వారిని రక్షించే దిశగా తాజా యంత్రాంగాలు రూపొందాయి. ఏ మాత్రం శ్రమలేకుండా ఆదాయార్జన సహజమైపోగా- మధ్యవర్తులు, దలారులు వగైరా పేర్లతో కమీషన్‌ ఏజెంట్లు మార్కెట్లను శాసించే పరిస్థితి దాపురించింది. ఆ మేరకు వీరు పంట ఉత్పత్తుల కొనుగోలుదారులుగానేగాక, రైతులకు అనధికార రుణదాతలుగా అవతారమెత్తారు.

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను పెంచడం ఒక్కటే ఇందుకు పరిష్కారం కాదు… ఎందుకంటే- కనీస మద్దతు ధరతో పంట కొనుగోళ్లవల్ల లబ్ధి పొందే రైతులు కేవలం 6 శాతమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మిగిలిన 94 శాతం రైతులు వ్యవసాయ మార్కెట్లలోనే తమ పంటలను విక్రయించాల్సి వస్తోంది. అయినప్పటికీ వారికి ఎలాంటి ప్రయోజనం లభించడంలేదు. ఇటు పొలాల వద్దనే పంట కొనుగోలుకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేసిన దాఖలాలుగానీ, అటు శీతల గిడ్డంగుల గొలుసు స్థాపన, ఆహార తయారీ పరిశ్రమల్లో పెట్టుబడులకు ప్రోత్సాహకాలుగానీలేవు. పంట ఉత్పత్తుల భారీ సేకరణను నిరోధించే, రైతులబేరసారాలశక్తిని నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణం. పర్యవసానంగా మిగిలిన రైతులు సార్వత్రిక మార్కెట్‌కు వెళ్లినందువల్ల వారికి ఎలాంటి ప్రయోజనాలూ లభించలేదు. దీంతో మనం ఏటా 10 శాతం వ్యవసాయ ఉత్పత్తులను ఆహార తయారీకి వినియోగిస్తుండగా శీతల గిడ్డంగులు అక్కడక్కడ మాత్రమే అందుబాటులో ఉన్నందున దాదాపు రూ.90,000 కోట్ల ఉత్పత్తులను నష్టపోతున్నాం.

మన దేశం ఆహార కొరత నుంచి మిగులుదేశంగా పరివర్తన సాధించిన తర్వాత- మన విధానాలు కొరత నిర్వహణ స్థితినుంచి మిగులు నిర్వహణవైపు మళ్లడం సముచితమే. ఇక ఇప్పుడు ఆహార భద్రతకు భరోసానిచ్చే ప్రస్తుత విధానాలకు మద్దతునిచ్చే వ్యవస్థ నేటి మన తక్షణావసరం. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో మనం విజయం సాధించినా ప్రపంచంలో ఇంకా వెనుకబడే ఉన్నాం. స్పర్థాత్మక మార్కెట్లు లేనందువల్ల వినియోదారులు చెల్లించే ధరలో రైతులకు దక్కుతున్నది కేవలం కాస్తంతమాత్రమే. అదే విధంగా రైతులు పండించే పంటల్లో ఆహార తయారీకి ఉపయోగపడే రకాలు లేకపోవటంవల్ల వాటికి మద్దతునిచ్చే సంధానాలు అందుబాటులో లేవు. దీంతోపాటు నాణ్యణ నియంత్రణ-ధ్రువీకరణ చాలాఅరుదు కావడంతో ఆహారఎగుమతి మార్కెట్లలో మన దేశం వాటా కూడా తక్కువగా ఉంటోంది.
ఈ అపసవ్య స్థితినిసముచితంగా సరిదిద్దడానికి వరుసగా ప్రభుత్వ కమిటీలు, కార్యాచరణ బృఃదాలు, నివేదికలు.. వగైరాలన్నీ ఒకేవిధమైన సిఫారసులు చేశాయి. వీటిలో మొదటిది- స్థానిక మండీ వ్యవస్థలో పోటీతత్వం అవసరం… రైతులు తమ ఉత్పత్తులను టోకు-చిల్లర వర్తకులకు విక్రయించుకోగల బహుళ వేదికలు అవసరం కాగా, ఏపీఎంసీ వ్యవస్థ ఇలాంటి వాటిని నిరుత్సాహపరుస్తుంది. రెండోది-ఆహారతయారీ పరిశ్రమతో మద్దతు సంధానాలనుపెంచడానికి కాంట్రాక్టు వ్యవ సాయానికి వీలుకల్పించే చట్రం అవసరం. అంతేగాక రైతులు పెట్టుబడులపై ప్రణాళిక రచించుకునే అవకాశం కూడా కాంట్రాక్టు వ్యవసాయంతో లభిస్తుంది.

తద్వారా అమలుకు వీలున్న ఒప్పందంతో స్థిరమైన ఆదాయం పొందగల భరోసా ఉంటుంది. మూడోది- నిత్యావసర వస్తువుల చట్టం క్రమబద్ధ అమలు ఫలితంగా శీతల గిడ్డంగుల స్థాపనలో పెట్టుబడులనునిరుత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో సంస్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు అనేకప్రయత్నాలుచేసినప్పటికీ అవి అతుకుల బొంతలా లేదాపైపై మెరుగు స్వభావానికి పరిమితమయ్యాయి. పర్యవసానంగా మిగిలినఆర్థికవ్యవస్థఆధునికతను సంతరించుకున్నప్పటికీ వ్యవసాయంబాగా వెనుకబడిపోయింది. ఇలాంటి కీలక సమస్యలన్నిటినీ పరిష్కరించడమే తాజా సంస్కరణల ఉద్దేశం. అందుకోసమే ‘‘రైతు ఉత్పత్తుల వాణిజ్య-వర్తక (ప్రోత్సాహం-వెసులుబాటు) బిల్లు-2020బీ రైతుకు ధరల-వ్యవసాయసేవల భరోసా(సాధికారత-రక్షణ) బిల్లు-2020, నిత్యావసరాల చట్టం (సవరణ) బిల్లు-2020’’ రూపుదిద్దుకున్నాయి. ఇకపై రైతులు ఆహార తయారీదారులతో ఒప్పందాలు కుదుర్చుకుని, అందుకు అనువైన పంటలు పండించడం ద్వారా హామీతో కూడిన గిట్టుబాటు ధర పొందవచ్చు. ఆ మేరకు వారు ఫలానా చోటనే తమ ఉత్పత్తులు విక్రయించుకోవాలన్న ఆంక్షలుండవు. అలాగే వ్యవసాయ సేవా ప్రదాతలతోనూ వారు ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. దీనివల్ల ‘వ్యవసాయం ఒక సేవ’గా భారీ ఊరటనిస్తుంది. ఈ సేవారంగంలో అనేక వ్యవసాయ-సాంకేతిక అంకుర సంస్థలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పంటల పరిజ్ఞాన కల్పనకు కృత్రిమ మేధస్సుతోపాటు ఉత్పత్తుల నాణ్యత విభజన-ధ్రువీకరణకు తగిన సాంకేతికతను వినియోగిస్తూ సేవలందిస్తాయి. కాబట్టి ప్రస్తుత సంస్కరణలు బలమైన పునాదులుగా ఈ సాంకేతికపరిజ్ఞానాలు భారతీయ వ్యవసాయంలో వినూత్న పరివర్తనకు బాటలు వేస్తాయి.

దేశాన్ని ప్రగతిపథంలో నిలిపే ప్రక్రియలో వ్యవసాయ రంగం ఆధునికీకరణ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరిగేకొద్దీ ఈ రంగంలోని మిగులు కార్మికశక్తి నిర్మాణం, తయారీవంటి అధిక ఉత్పాదకతగల రంగాల్లో విలీనమవుతుంది. అయితే, ఒకవైపు భారతవ్యవసాయరంగంతక్కువఉత్పాదకతవలలో విలవిల్లాడుతుండగా మరోవైపు వ్యవసాయంనుంచి కార్మికశక్తిని ఆకర్షించగలిగేలా తయారీ రంగంలో తగినన్ని ఉద్యోగాల సృష్టి కనిపించడంలేదు. అయితే, ప్రస్తుతమహమ్మారిమనకు గొప్పఅవకాశం కల్పించింది. తదనుగుణంగా తయారీ రంగంలో తీసుకున్న వినూత్న చర్యలతో సరిజోడుగా సాగే వ్యవసాయ రంగాన్ని ఇకపై మనం చూడబోతున్నాం. ఉత్పాదకఅనుసంధానప్రోత్సాహకపథకాలు, కేంద్రస్థాయిలోగల అనేక రకాల కార్మిక చట్టాలను హేతుబద్ధం చేయగల మూడుకార్మికస్మృతులను లోక్‌సభలో సమర్పించడం, వాణిజ్య సౌలభ్యానికి మరింత ఉత్తేజం-మరియువిదేశీపెట్టుబడులకు ఆహ్వానం వంటివన్నీ తయారీ రంగంలోఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తాయి. అంతేగాక మౌలికసదుపాయాలలో పెట్టుబడులు, సంబంధిత ఇతర అనుబంధ ప్రభావాలు కలగలసి వ్యవసాయేతరరంగాల్లో ఉద్యోగాలకల్పనకు మరింత వీలు కల్పిస్తాయి. ఆహారతయారీ పరిశ్రమలఅభివృద్ధితోగ్రామీణ, వ్యవసాయేతరఉపాధి, ఉద్యోగాలనుసృష్టిస్తుంది.

మార్కెటింగ్‌ ‌రంగంలో సంస్కరణలకు తోడుగా గ్రామీణ మౌలిక వసతులకు కట్టుబాటు మరింత బలాన్నిస్తుంది. ఆ మేరకు వ్యవసాయ కమతాల వద్దకు అవసరమైన సదుపాయాల అభివృద్ధి కోసం రూ.1 లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్‌) ఏర్పాటు చేయబడింది. ఇందులో భాగంగా ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, ఆహార తయారీకి ముందు అవసరమైన సౌకర్యాలు వగైరాలు కల్పించబడతాయి. అలాగే రైతు ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు / సంస్థలద్వారా రైతుల సమీకరణకు నిరంతర ప్రోత్సాహం కొనసాగుతుంది. దీనివల్ల రైతుల బేరసారాల శక్తి ఇనుమడించి, రైతు ఉత్పత్తుల సంస్థల పరిధిలో సామాజిక ఆస్తుల వృద్ధికి దోహదం చేస్తుంది. అలాగే రైతు ఆదాయ వైవిధ్యీకరణ కోసం పశుసంవర్ధక, మత్స్య రంగాల అభివృద్ధికి కూడా నిధి ఏర్పాటు చేయబడింది. మనదేశం ఇప్పటికే అతి పెద్దపాల ఉత్పత్తిదారు కాగా- తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు,చేపల విషయంలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే మన ఉత్పాదకత స్థాయి తక్కువే అయినా ఉత్పత్తి పరిమాణం అధికంగానే ఉంది. కానీ, ఉత్పాదనకు విలువ జోడింపు స్వల్పం కావడంవల్ల ప్రపంచ ఆహార ఎగుమతి మార్కెట్లలో మన వాటా కేవలం 2.3 శాతానికే పరిమితమైంది. కాబట్టి, భారత ఉత్పాదకత స్థాయి ప్రపంచ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా రూపొందితే ప్రపంచ ఆహార సరఫరా గొలుసులో మన దేశం ఒక ముఖ్యమైన సంధానశక్తిగా ఆవిర్భవించగలదు. ఆ మేరకు భవిష్యత్తులో ఆహార ఎగుమతులకు ప్రపంచ కూడలిగా రూపొందడానికి తగిన పర్యావరణాన్ని ఈ సంస్కరణలు సమకూరుస్తాయి.

వ్యవసాయ సంస్కరణలు చరిత్రాత్మకం అన్నది సముచితమే. ఇంత ప్రాముఖ్యంగల ఈ సంస్కరణల అమలుకు దలారీ వ్యవస్థ నిర్మూలనపై బలమైన రాజకీయ సంకల్పంతో కూడిన నిర్ణయాత్మక కార్యాచరణ అవసరం. ఈ నేపథ్యంలో రైతుశ్రేయస్సుపై చిత్తశుద్ధిని ప్రభుత్వం ఈ సంస్కరణల ద్వారా పునరుద్ఘాటించింది. ఈ సంస్కరణల ఫలితాలను రైతు ముంగిటకు చేర్చడం తదుపరి దశ కాగా- ఈ విషయంలో సాంకేతిక పరిజ్ఞానం వారధిగా ఉపయోగపడాల్సి ఉంది. మన దేశంలోని 500 మిలియన్లబలమైన కార్మికశక్తిలో 43 శాతం వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నందున తాజా సంస్కరణలతో భారత రైతు లోకానికి సాంకేతిక పరిజ్ఞానం చేరువై వారి శ్రేయస్సుకు దోహదం చేయడంతోపాటు లక్షలాది జీవితాల్లో పరివర్తనాత్మక మార్పు చోటుచేసుకోనుంది.

amitab kanth
అమితాబ్‌ ‌కాంత్‌
‘‌నీతి ఆయోగ్‌’ ‌ముఖ్య కార్యనిర్వహణాధికారి(రచయిత‘నీతి ఆయోగ్‌’ ‌ముఖ్య కార్యనిర్వహణాధికారి…ఈ వ్యాసంలోని అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతం.)

Leave a Reply