Take a fresh look at your lifestyle.

మత్స్య శాఖ ఉన్న విషయం రాహుల్‌కు తెలియదా?

  • 2019లోనే ప్రభుత్వం ఆ శాఖను ఏర్పాటు చేసింది
  • అబద్ధాల సంస్కతి ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రజలకు సేవ చేస్తుందా?
  • పుదుచ్చేరి పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ

అబద్దాల సంస్కృతితో నిండిపోయిన ఆ పార్టీ నిజంగా ప్రజలకు సేవ చేస్తుందా అని కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రధాని మోదీ నిలదీశారు. మాజీ సీఎం నారాయణస్వామి..పుదుచ్చేరి ప్రజలను విస్మరించారన్నారు. స్థానిక ప్రజలకు అబద్దాలు చెప్పారని, స్వంత నేతనే తప్పుదోవ పట్టించినట్లు ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుదుచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విమర్శలు గుప్పించారు. ఈ మధ్య తమిళనాడుకు వొచ్చిన సందర్భంలో రాహుల్‌ ‌చేసిన వ్యాఖ్యలు తనను షాక్‌కు గురి చేశాయని ఆయన చెప్పారు.

కేంద్రంలో మత్య్సశాఖ ఏర్పాటు చేయడంపై రాహుల్‌ ‌చేసిన వ్యాఖ్యలపై మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రంలో ఈ శాఖ ఉన్న విషయం రాహుల్‌కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. 2019లోనే ఎన్డీయే ప్రభుత్వం ఈ శాఖను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓ కాంగ్రెస్‌ ‌నేత ఇక్కడికి వొచ్చి మత్య్సశాఖ లేదని, తాము ఏర్పాటు చేస్తామని చెప్పడం తనను షాక్‌కు గురి చేసిందని, నిజమేంటంటే ఆ శాఖ ఇప్పటికే ఉందని, 2019లోనే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటూ రాహుల్‌ ‌పేరును మోదీ నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇటీవల కాంగ్రెస్‌ ‌పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ పుదుచ్చేరిలో పర్యటించారు. ఆ సమయంలో ఓ మహిళ తమిళ భాషలో తమ ఇబ్బందులు విన్నవించుకున్నది.

నివర్‌ ‌తుఫాన్‌ ‌సమయంలో ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. అయితే మాజీ సీఎం నారాయణ స్వామి..ఆ మహిళ ఫిర్యాదును రాహుల్‌కు తప్పుగా తర్జుమా చేశారు. తుఫాన్‌ ‌వేళ తమ ప్రభుత్వం ఆదుకున్నట్లు ఆ మహిళ చెబుతుందని రాహుల్‌ ‌గాంధీకి తప్పుగా తర్జుమా చేసి చెప్పారు. ఈ విషయాన్ని సభలో గుర్తు చేసిన మోదీ.. పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి దేశాన్ని తప్పుదోవ పట్టించినట్లు ఆరోపించారు. పుదుచ్చేరిలో ప్రజల మాట వినే ప్రభుత్వం ఉండాలని, ఢిల్లీలో ఉన్న కొంత మంది కాంగ్రెస్‌ ‌నేతలు కాదన్నారు. పుదుచ్చేరిలో ఏర్పడబోయే ప్రభుత్వం..ప్రజల ప్రభుత్వంగా ఉంటుందని, ఎన్డీఏ ఆ హావి• ఇస్తుందని మోదీ అన్నారు. పార్టీ హైకమాండ్‌ ‌నేతల చెప్పులు మోయడంలో మాజీ సీఎం నిపుణుడని ప్రధాని ఆరోపించారు.

Leave a Reply