Take a fresh look at your lifestyle.

అదృశ్య దు:ఖం

ఆకాశంలోని రెండు తారలు
భూమిమీద సడివిన పాదాలకు
వెలుగును అద్దాలని ఆరాట పడుతున్నవి
కుదరక
కన్నీరు కర్చుతున్నవి.

అవునులే.
గతం పరాయి పెత్తనం పై
జరిపిన సమరం ఓ కన్నీటి చరిత్ర ..
పుటల్లో సదవనికే..కదా…!
ఆచరణ ఆకాశాన్ని అంటింది..

ఉన్నాదే తిని
లేనప్పుడు ఆశయాల్ని మింగి
గుండె నిబ్బరంతో అడుగు ముండుపడ్డ
వర్ణ వివక్ష విశృంఖల విహారం చేసిన
కులం వర్గంలో ఆలోచనని మ్రింగచుసిన
కొన్ని కపట శక్తులను
అడ్డంకులను ఆకాటితో అధిగమించి
సాధించిన పత్రం..
నిరుద్యోగ దుకాన్ని ఆపలేకుండ
ఏకాంతంలో అంతర్యుద్ధం చేస్తుంది…

దళిత బంధు, రైతు బంధు,
ఇంకో కొత్త ‘‘బంధు’’ బందాలన్ని వోట్లు రాల్చనికి
పడే పాట్లు ఒక్క పారి రైలు పట్టలతో మొరపెట్టుకున్నా మాంసం ముద్దని అడగండి..
స్వరాష్ట్ర సాధనకై ఆ నేత్తురు ఎన్ని మార్లు
లాఠీ దెబ్బల గుర్తులు ఎన్ని దరించిందో?
అవును లే..
బతికున్నోడే అనుభవించాలనే
త్యాగాల చరిత అక్కరలేని గొర్రెలు
రోజు ఉన్ని నిచ్చినప్పుడు
రగ్గులవ్వడం ఏమంత పని…

ఇప్పుడు నిరుద్యోగం
అదృశ్య దు:ఖం..
ఎంతకీ తీరని
అరణ్యరోదన అన్ని దుకాణాల్లో
పొట్లాల పాకింగ్‌ ‌లో రాటుదేలుతున్నై.
కొన్నేమో చెప్పలేక ఉరికొయ్యల్ని ముద్దాడుతున్నాయి..
ఫలాలు మాత్రం కొందరికే..
స్వరాష్ట్ర ఉద్యోగ ప్రకటన ఊట
నిరుద్యోగుల పాలిట ఎడారిగా మారడం..
ఆకాశరోదనే….

– నాగరాజు మద్దెల
6301993211.

Leave a Reply