Take a fresh look at your lifestyle.

ఎవుసం చేసుకుంటే ఊళ్లోనే ఉండొచ్చు

  • లాభానికి లాభం.. కుటుంబం సంతోషం..!
  • బడ్జెట్లో 35శాతం రైతులకు ఖర్చు చేస్తున్న ఏకైక సర్కారు
  • యువత సెరికల్చర్‌పై దృష్టి పెట్టాలి
    పట్టు రైతు సమ్మేళనంలో రాష్ట్రమంత్రి హరీష్‌ ‌రావు
  • కందులు కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాస్తాం:నిరంజన్‌ ‌రెడ్డి

Another task for a target In Municipal Elections minister harish raoAnother task for a target In Municipal Elections minister harish rao

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మార్కెట్‌ ‌యార్డులో శుక్రవారం రాష్ట్ర పట్టు రైతుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి మంత్రులు హరీష్‌ ‌రావు, నిరంజన్‌ ‌రెడ్డిలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు ముందుగా..బెజ్జంకి మండలం గాగిలాపూర్‌ ‌గ్రామానికి చెందిన మహిళా ఆదర్శ రైతు మంగ మాట్లాడుతూ ‘5 ఏళ్ల నుంచి పట్టు, మల్బరీ సాగు చేస్తున్నాను. 4 ఎకరాల్లో పట్టు సాగు చేస్తే 2 క్వింటాళ్ల పంట వొచ్చింది. 60 నుంచి 70 వేల రూపాయల ఖర్చు వెయ్యి గుడ్లు వొస్తాయి. 20 నుంచి 30 రోజుల్లో గుడ్డు నుంచి పంట వొస్తుంది. 2 లక్షల ఆదాయం వొస్తుంది. గుడ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. మాములు పంట కన్నా పట్టు ఉత్పత్తి చాలా మంచిది. పత్తి పంటలు వేయడం మానేసి పట్టు ఉత్పత్తి చేస్తున్నాం. 3 నుంచి 4 లక్షలు ప్రతి ఎకరాకు ఒకే యేడాదిలో మిగులుతుంది. ఒక్కసారిగా ప్రారంభం చేయడానికి 4 నుంచి 5 లక్షలు ఖర్చు వస్తుంది. ఆ తర్వాత పంట 60 నుంచి 70 వేలల్లో అయిపోతుంది. 2 ఏళ్లలో కోటీశ్వరులు అవుతాం’ అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మంగ మాటల్లోనే మాట్లాడుతూ.. 30 వేలు కావాలంటే పత్తి పంట, 3 లక్షలు ఆదాయం కావాలంటే.. పట్టు ఉత్పత్తి చేయాలని పట్టు రైతులకు సూచించారు.
భరత్‌, ‌రైతు- రాయలసీమ
పట్టు రైతు అయినందున సంతోషిస్తున్నాను. దేశంలో ఎక్కడా పట్టు రైతులకు ఆత్మ హత్యలు లేవు. ఒకటి, రెండు ఎకరాల్లో సాగు చేసినా మంచి ఆదాయం వొస్తుంది. మాది రాయలసీమ, పీజీ చేశాను. నీళ్లు తక్కువగా ఉన్నా.. మల్బరీ సాగు చేయవచ్చు. సెరి కల్చర్‌ ‌చాలా లాభసాటి. నిరుద్యోగులు, చదువుకున్న వారు సెరి కల్చర్‌ ‌చేయండి. మీకు సాఫ్ట్ ‌వేర్‌ ‌సంపాదన వొస్తుంది. చిన్నప్పటి నుంచి సెరి కల్చర్‌ 3 ఎకరాల్లో చేస్తున్నాను. ప్రతి ఏడాదికి 5 నుంచి 8 లక్షల్లో ఆదాయం వస్తున్నది. మార్కెట్‌ ‌సమస్యే లేదు.
శిల్ప- సూర్యాపేట- రైతు నుంచి పారిశ్రామిక వేత్తగా మారాను నేను ఒక సాధారణ గృహిణిగా చీరలు అమ్ముకునేవాళ్ళం. 2014లో వ్యవసాయం చేద్దామని అనుకుని పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారించాం. ప్రతినెలా డబ్బులు సంపాదిస్తున్నాం. భూమి తీసుకుని ముందుగా 9 ఎకరాల్లో పట్టు సాగు చేయడం ప్రారంభించాం. తొలి నెల అన్నీ ఖర్చులు పోయి 80 వేల రూపాయలు సంపాదించాం. మమ్మల్ని చూసి 20 మంది పట్టు సాగు చేయడం ప్రారంభించారు. 9 నుంచి 10 బ్యాచ్‌లు యేడాదికి తీస్తున్నాం. మా కుటుంబ సభ్యులతో అందరం ఇదే పట్టు పురుగుల పెంపకం చేస్తున్నాం.

13ఏండ్లు సాఫ్ట్ ‌వేర్‌ ఇం‌జనీరుగా పని చేశా : పుండరీకం, నల్గొండ

13 ఏళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీరుగా పని చేశాను. సింగపూర్‌, ‌మలేషియాలో పని చేశాను. ఇండియాకు వొచ్చిన తర్వాత బెంగళూరు, ఢిల్లీ, చెన్నయ్‌ ‌తిప్పేవాళ్లు. ఏడాదిన్నర రీసెర్చ్ ‌చేసి పట్టు పరిశ్రమ రంగం ఎంచుకున్నాను. ఎకరానికి లక్షకు తగ్గకుండా ఆదాయం సంపాదిస్తున్నాను.

- Advertisement -

ఎవుసంను మించింది లేదు:రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌
ఆదర్శ రైతుల మాటల్లో లాభసాటి వ్యవసాయం కనిపిస్తున్నదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. ఇది రైతు ప్రభుత్వం. సీఏం కేసీఆర్‌ ‌రైతు బాంధవుడు. మిషన్‌ ‌కాకతీయ పథకం తెచ్చి చెరువులను బాగు చేయించాం. కాళేశ్వరం, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులు తెచ్చి రైతులకు సాగు నీరు అందిస్తున్నాం. వేయి కోట్లతో మండలానికి గోదాములు, ఉచిత విద్యుత్‌, ‌పంటలకు మద్దతు ధర, వ్యవసాయ పని ముట్లు, ట్రాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం అందించింది. బడ్జెటులో 30 నుంచి 35 శాతం రైతులకు ఖర్చు చేస్తున్నది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు డైరీ, గొర్రెలు, యూనిట్లను ప్రోత్సహించింది. రైతులకు నీళ్లు వచ్చాయి. ఇక ఆదాయం రావాలి. సెరి కల్చర్‌ ‌రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఆనందం కలుగుతుంది.

పుండరీకం రైతు యువతకు ఆదర్శం. అవుట్‌ ‌సోర్సింగు ఉద్యోగాలు 15 వేల జీతం ఊరిని, కుటుంబాన్ని వదిలి వెళ్లాలి. మీ ఊర్లో వ్యవసాయం చేసుకుంటే లాభం వస్తుంది. యువత సెరి కల్చర్‌ ‌పై దృష్టి సారించాలి.  భారత దేశంలో అవసరమైన పట్టు ఉత్పత్తి తక్కువ. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ మాదక ద్రవ్యం కూడా దేశానికి భారం. తెలంగాణ రాష్టం ఏర్పాటయ్యే ముందు 4 వేల ఎకరాల్లో పట్టు సాగు వచ్చింది. కానీ తెలంగాణ వచ్చాక 11 వేలకు పెరిగింది. ఇంకా పెరగాలి. 25 రూపాయల రాయితీని ప్రభుత్వం 75 రూపాయలకు చేసింది. రాయితీలు పంచాయతీ రాజ్‌ ‌శాఖ వారితో మాట్లాడి ఈజీఎస్‌ ‌కింద మద్దతు పొందాలి. సకాలంలో డబ్బులు విడుదల చేసి అమ్మెలా చర్యలు తీసుకుంటాం. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. విదేశీ మాదక ద్రవ్యం మిగులుతుంది. లక్షకు పైగా ఆదాయం సెరి కల్చర్‌ ‌రైతులకు వస్తుంది. 3 ఎకరాల్లో 5 లక్షల ఆదాయం వస్తుంది. మల్బరీ చెట్టు పెడితే 15 ఏళ్లు ఉంటుంది. గూగుల్‌, ‌మైక్రో సాఫ్ట్ ఉద్యోగాల కన్నా ఆరోగ్యం, ఆదాయం వస్తుంది. ఈ ఉద్యోగాలకు టాక్స్ ‌కట్టాలి. రైతు ఏ టాక్స్ ‌కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా 30 వేల ఎకరాల్లో సాగు చేసే పరిస్థితి ఉంది.  భూమి ఉన్న యువత ఈ రంగం వైపు రావాలి. తెలంగాణ ఈ యేడాది 3 రెయిలింగ్‌ ‌యూనిట్లు ఇస్తామని చెప్పినట్లు, మార్కెట్‌ ‌బలోపేతం అవుతుంది. ఒక కిలో రానున్న రోజుల్లో 500 రూపాయలకు ధర ఉండవచ్చని చెబుతున్నారు. చైనా నుంచి ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటే.. అక్కడ లేబర్‌ ‌కాస్ట్ ‌పెరిగింది. మనకు ఆ అవకాశం రావాలి. కర్ణాటక రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంది. మనం 11 వేల ఎకరాల్లో మాత్రమె చేస్తున్నాం. మనమంతా వరి, పత్తి పంటల పైనే దృష్టి పెడుతున్నామని, కానీ ఆదాయం మాత్రం 30 వేలు మాత్రమె ఉంటున్నదని, కానీ సెరి కల్చర్‌ ‌వెళితే 3 లక్షల ఆదాయం వస్తుంది. యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు.

 

అన్నింటికీ సిద్ధిపేట వేదిక: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి

వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయానికి ఈ సదస్సు తెరలేపింది. అన్ని కార్యక్రమాలకు సిద్ధిపేట వేదిక, దిక్సూచి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్త రైతాంగానికి ఈ సదస్సు సిద్ధిపేట నుంచి ఓ సంకేతం పంపుతాం. రైతును రాజు చేసేందుకు కేసీఆర్‌  ‌పరితపిస్తున్నారు. ఆ స్ఫూర్తితోనే ఇతర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించి లాభాలు గడించవొచ్చని సెరికల్చర్‌ ‌నిరూపిస్తున్నది. 4 దశాబ్దాలుగా సెరికల్చర్‌ ‌నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ ప్రభుత్వం సెరికల్చర్‌పై దృష్టి సారించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. రాష్ట్రంలో మామిడి తోటల విస్తీర్ణం కేవలం 4 లక్షల ఎకరాలు అయితే రైతాంగానికి వొచ్చే టర్నోవర్‌ ‌విలువ 1100 కోట్ల రూపాయలు, ఇంకా పెట్టుబడి ఇతర ఖర్చులు తీయాలి. పట్టుసాగుకు 11వేల ఎకరాల్లో సాగు ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్ళల్లో 4 వేలు ఎకరాలు కానీ., ఐదేళ్లలో 7 వేలు పెంచుకున్నాం. దీని టర్నోవర్‌ 1400 ‌కోట్లు వస్తుంది. 4 లక్షల ఎకరాలకు 1100 కోట్లు. 11వేల ఎకరాల్లో 1400 కోట్లు ఈ అంతరాన్ని గమనించాలి. నిరుద్యోగులైన యువత మల్బరీ సాగు చేస్తే సాఫ్ట్ ‌వేర్‌ ‌కంటే ఎక్కువ జీతాలు వొస్తాయి. రైతులు స్వయంగా తమ అనుభవాలు ఈ వేదిక నుంచి చెప్పారని వస్తున్న ఆదాయం, ఆధారాలతో చూపుతున్నారని దీనిని రైతులు గమనించాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం షెడ్డు వేయడానికి అనుమతి ఇస్తుంది.

 

షెడ్డు కట్టడానికి పంచాయతీ రాజ్‌ ‌శాఖ వారిని కోరుతూ ఇద్దరినీ పంపుతాం. షెడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన ఉపాధి హామీ పథకం పని కింద చేపడుతాం. కోతుల బెడద, పందుల బెడద, వాన, వడగాలి బెడద లేడు. మార్కెటు సమస్య లేదు. వ్యవసాయం అన్నీ వృత్తుల కంటే గౌరవ ప్రదమైనదని, సెరి కల్చర్‌ ‌ద్వారా సునాయాసంగా రుజువు చేయవచ్చు. సిద్ధిపేట జిల్లాలో 900 ఎకరాల్లో పట్టు సాగు చేస్తూ ప్రథమ స్థానంలో నిలిచింది. సెరి కల్చర్‌ ‌రైతుల్లో ఆత్మ విశ్వాసం అమోఘం. ఆధునిక పరిజ్ఞానాన్ని రైతు వినియోగించుకోవాలి. ఆర్థికంగా గట్టిగా ఉన్న మనిషే రైతు అని చెప్పుకునేలా ఉండాలి. మార్కెటింగ్‌ ‌వ్యవస్థలో సమస్యలు అధిగమించడానికి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశాం. కందుల కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కేంద్రం 46వేల మెట్రిక్‌ ‌టన్నుల కందులు ఏంఎస్పీ ధర ఇస్తానని చేతులెత్తేసింది. 50వేల మెట్రిక్‌ ‌టన్నుల కందులు కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాస్తాం అని నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply