Take a fresh look at your lifestyle.

బీజేపీకి గడీల శ్రీకాంత్ గౌడ్ రాజీనామా  

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. పార్టీ నిర్ణయాలతో అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి, పటాన్ చెరు మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ కూడా బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ పార్టీకి ఆయన రాజీనామా ప్రకటించారు. గురువారం తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి  పంపారు. బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. తాను పార్టీ కోసం పని చేసి అన్ని విధాల నష్టపోయాయని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో నా విషయంలో జరిగిన పరిణామాలు నా అభిమానులు, కార్యకర్తలను తీవ్రంగా కలిచివేశాయని అన్నారు. పార్టీ నాతో వ్యవహరించిన తీరుతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, చాలా మంది నా వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. బీజేపీ పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేసిన వారికి పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదు. నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసి అన్ని విధాలుగా నష్టపోయానని, కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి, వారి మనోభావాలను గౌరవిస్తూ బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నానని అన్నారు. ఇన్ని రోజులు నాతో పాటు కలిసి పనిచేసి సహకరించిన ప్రతి ఒక్కరికి గడీల శ్రీకాంత్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply