Take a fresh look at your lifestyle.

ఆకట్టుకున్న కళా విశారద డాక్టర్ సురభి లక్ష్మి శారద ప్రదర్శన

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 09 :  ఒయాసిస్ ఫౌండేషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఏకతాన్ భారతీయ కళల సమాహారాన్ని ఈజిప్ట్ కైరో భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళా విశారద డాక్టర్ సురభి లక్ష్మి శారద ప్రదర్శించిన బాల గోపాల తరంగం జావలీల అభినయ ప్రదర్శన అహుతులను ఆకట్టుకుందని డీసీఎం మిస్టర్ గుప్తా టీఎస్ ఆఫ్ అంబాసిడర్ ప్రజాష్ కుమార్ చౌదరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొట్ట మొదటి సారిగా ఈజిప్టులో పళ్లెంపైన నృత్యాన్ని తిలకించామని వృత్త అభినయ విన్యాసాలు ఆద్యంతం సభికులను ఆనంద పరవశులను చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ సురభికి కళా శ్రేష్ఠ సమాన్ అవార్డుతో సత్కరించినట్లు తెలిపారు. వివిధ కళా ప్రదర్శనలు అనంతరం కొనసాగాయన్నారు. సురభి అకాడమీ శిష్య బృందం చక్కని నాట్య ప్రదర్శన చేసినట్లు వివరించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply