Take a fresh look at your lifestyle.

భారతదేశ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కేవలం కాగితాల వరకేనా?

[ads-pullquote-left][ads_color_box color_background=”#62f5dc” color_text=”#444″]2030 అజెండా వెనుకవున్న మన లక్ష్యం చాలా పెద్దది. ఆ లక్ష్యాలు చాలా వివరణాత్మకంగా వున్నాయి. గత దశాబ్దాల నుంచీ వస్తున్న సమస్యల పరిష్కారానికి ఈ లక్ష్యాలు ప్రాధాన్యత నిస్తున్నాయి. మన జీవితాలను శాసిస్తున్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను ఇవి ప్రతిఫలిస్తున్నాయి…’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు కూడా! ప్రకటన గంభీరంగానే వుంది కానీ, కార్యాచరణ ఏమిటనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం  అయితే వుంది కదా?[/ads_color_box][/ads-pullquote-left]

ఈ రోజుతో 2019 పూర్తవుతుంది. మనం 2020 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. మామూలుగా చూస్తే ఇది ఒక సంవత్సరం ముగిసి ఇంకో కొత్త సంవత్స రంలోకి అడుగు పెడుతున్నట్లు! కానీ, అంతర్జాతీయ సమాజంలో భారత ప్రభుత్వం బాధ్యత పడిన అంశాలకూ, ఈ 2020 సంవత్సరానికి ఒక ప్రత్యేకత వుంది. 2020 సంవత్సరం నాటికల్లా  తమ తమ దేశాల్లో అభివృద్ధి పథంలో కొన్ని అంశాల మీద గుణాత్మకమైన మార్పులు తీసుకుంటామని, 189 దేశాలు ఐక్యరాజ్య సమితిలో కలిసికట్టుగా 2000 సంవత్సరంలో ప్రకటించారు. వాటినే మిలీనియం డెవలప్మెంట్‌ ‌గోల్స్(ఎం‌డిజి) అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇందులో మన భారతదేశం ప్రధాన భాగస్వామ్యం తీసుకుంది, అంటే వీటిని అమలు చేస్తామని అధికారికంగా సంతకం పెట్టింది! ప్రభుత్వం చర్యలు తీసుకుంటామన్న ఆ 8 అంశాలు : 1. దేశంలో ఆకలిని, పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం 2. దేశంలో పిల్లలందరికీ సంపూర్ణంగా ప్రాథ•మిక విద్యను అందించడం 3. జెండర్‌ ‌సమానత్వం కోసం పనిచేయటం, స్త్రీల సాధికారతను పెంచడం 4. శిశు మరణాలను తగ్గించడం 5. ప్రసవ సమయంలో తల్లుల మరణాలను అరికట్టడం 6. మలేరియా, ఎయిడ్స్, ‌హెచ్‌ఐవి లాంటి జబ్బులను తగ్గించే దిశగా పోరాటం 7. పర్యావరణ పరిరక్షణ-స్థిరత్వం 8. దేశ అభివృద్ధి పథంలో అవసరమైన అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం.

Are India's sustainable development goals just paperwork?వీటిని, 2015 కల్లా పూర్తి చేసి, వాటిని స్థిరపరిచే విధంగా కొత్త విధానాలు చేపట్టాలని, వాటిని సస్టైనబుల్‌ ‌డెవలప్మెంట్‌ ‌గోల్స్(ఎం‌డిజి) అని పేరు కూడా నిర్ణయించారు. మళ్ళీ ఇందులో 17 అంశాలు వున్నాయి, వాటి కోసం 169 కార్యాచరణలు ఏర్పరచారు. అన్ని దేశాలూ, 2030 నాటికి వీటిని సాధించాలని ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్‌ 25, 2015 ‌నాడు ప్రకటించింది. ఈ లక్ష్యాలన్నిటినీ పూర్తి చేయటానికి బాధ్యత పడతామని ‘‘2030 అజెండా వెనుకవున్న మన లక్ష్యం చాలా పెద్దది. ఆ లక్ష్యాలు చాలా వివర ణాత్మకంగా వున్నాయి. గత దశాబ్దాల నుంచీ వస్తున్న సమస్యల పరిష్కారానికి ఈ లక్ష్యాలు ప్రాధాన్యత నిస్తున్నాయి. మన జీవితాలను శాసిస్తున్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను ఇవి ప్రతిఫలిస్తున్నాయి…’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు కూడా! ప్రకటన గంభీ రంగానే వుంది కానీ, కార్యాచరణ ఏమిటనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం  అయితే వుంది కదా? ఇదేదో కేవలం కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయంగా మాత్రమే చూస్తే కుదరదు. కేంద్ర స్థాయి నుంచీ రాష్ట్ర స్థాయి, గ్రామీణ పంచాయితీ స్థాయి వరకూ ఈ లక్ష్యాల అమలుకి తీసుకుంటున్న చర్యల గురించి ప్రతి ఒక్కరూ బాధ్యత పడవలసిందే.

అవి :

 1.  పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం
 2. ఆకలి అనేది లేకుండా, సుస్థిర ఆహార భద్రతని సాధించడం
 3. మంచి ఆరోగ్యం, జీవన ప్రమాణాల పెంపుదల
 4. నాణ్యమైన విద్య
 5. జెండర్‌ ‌సమానత్వం
 6. శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం
 7. అందుబాటులో పర్యావరణ హితమైన ఇంధనం
 8. గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థిక పెరుగుదల
 9. పరిశ్రమలు, మౌలిక వసతుల  రూపకల్పన
 10. అసమానతలను తొలగించడం
 11. సుస్థిర నగరాలు, సమూహాలు
 12. సుస్థిర ఉత్పత్తి, వినియోగం
 13. పర్యావరణ కార్యాచరణ
 14. నీటి వనరులు – పర్యావరణం
 15. భూమి-పర్యావరణం
 16. శాంతి, న్యాయం, పటిష్టమైన వ్యవస్థలు
 17. లక్ష్యాల సాధనకు భాగస్వామ్యం

మిలీనియం అభివృద్ధి లక్ష్యాలయినా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలయినా గానీ వినడానికి, చదవటానికి ఎంతో బావున్నాయి. కానీ, నిజంగా ఆచరణలో ఎంతవరకూ సాధించగలిగాము అంటే సమాధానం మనమెవరికీ సంతృప్తిగా అనిపించదు. ముందు ఎండిజిలోని  8 లక్ష్యాలను గమనిస్తే, అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా ఆ అంశాలలో మనం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో అధికారికంగా వెలువడే ప్రపంచ ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి సూచికలే ఉదాహరణగా నిలుస్తాయి. ఈ మిలీనియం అభివృద్ధి లక్ష్యాలలో భారతదేశం పూర్తిస్థాయి విజయాన్ని అందుకోలేదని ‘వాదా న తోడో అభియాన్‌’( ‌చేసిన వాగ్దానాల్ని ఉల్లంఘించకు) పేరుతో దేశవ్యాపితంగా నడుస్తున్న సామాజిక ప్రచారోద్యమం ప్రకటించింది. ‘సార్వత్రిక ప్రాథమిక విద్య, రాజకీయ భాగస్వామ్యం, స్త్రీ సాధికారత, శిశు మరణాల తగ్గింపు, బహిరంగ మల విసర్జన రూపుమాపలేకపోవటం, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించలేకపోవటం వున్నాయని ‘అభియాన్‌’ ‌వాస్తవ గణాంకాల ద్వారా ప్రకటించింది.ఇప్పుడు 17 అంశాలతో, 169 కార్యాచరణలతో  నాలుగేళ్ల క్రితం మన ముందుకు వచ్చిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన గురించి గంభీరంగా ప్రకటనలు చేసే ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం వాటికి తద్విరుద్ధంగా పనిచేస్తున్నాయనేది మనకు స్పష్టంగా కనిపించే విషయం. మొదటి విషయాన్నే తీసుకుందాం. పేదరిక నిర్మూలన, పేదల నిర్మూలనగా మారుతోందా? తీసుకుంటున్న విధానాలు ప్రజలను వారి అవాసాల నుంచి తరిమేస్తున్నాయి. అది, అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న భూసేకరణలు, అటవీ ప్రాంతంలో ఆదివాసీలను బయటకు తరిమే తీర్పులు చూస్తే అవి పేద ప్రజల జీవితాల్ని అస్థిరత్వంలోకి నెడుతున్నాయనేదానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. తమ ఆవాసాల నుంచీ పెకిలించివేయబడిన ప్రజలకు, ఇప్పుడు పౌరసత్వ నిరూపణ పేరుతో అస్తిరత్వంలోకి వెళ్ళబోతున్న ప్రజలకు ఆ తర్వాతి లక్ష్యాలు ఏ విధంగా అందుబాటులోకి వస్తాయనేది అత్యంత ముఖ్యమైన ప్రశ్న?.

రెండో లక్ష్యం, ఆకలిని అంతమొందించడానికి తీసుకోవాల్సిన మొదటి విధానం, ప్రస్తుత వ్యవసాయ విధానంలోతీసుకోవాల్సిన మార్పులు. సుస్థిర వ్యవసాయ విధానం వైపుగా పడాల్సిన కార్యాచరణ. అది కొరవడినందుకే ఇంకా ఇంకా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలతో సంక్షోభంలోకి కూరుకుపోతున్న వ్యవసాయరంగం. అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయ అంశాన్ని ఎన్నికల పాచికగానే చూస్తున్నాయి కానీ, దేశ పౌష్టికాహార భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించక పోవటం వల్లే, దాదాపు డెబ్బై శాతం పైన దారిద్య్రరేఖకు దిగువన వున్న మన దేశ పేదవర్గాల పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. మన రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కుకి ఇది అతి పెద్ద ఉల్లంఘన. పిల్లల్లో ఈ పౌష్టికాహార లోపం, ఆఫ్రికా ఖండంలోని సబ్‌ ‌సహారన్‌ ‌దేశాలకన్నా ఎక్కువ! అంటే మన దేశ పాలకులు ఈ అంశం మీద ఎంత నిర్లక్ష్యంగా వున్నారో అర్థం చేసుకోవచ్చు. రెండో లక్ష్యానికి అనుబంధమైనది మూడో లక్ష్యం ‘అందరికీ ఆరోగ్యం-సుస్థిర జీవన ప్రమాణాల పెంపుదల’. పౌష్టికాహారం అందనిచోట ఆరోగ్య పరిస్థితి ఎంత తక్కువ స్థాయిలో వుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం వుండదు. ఆరోగ్యం విషయంలో పౌష్టికాహారం ఎంత ముఖ్యమైనదో, చుట్టూ వుండే వాతావరణం కూడా కాలుష్య భరితంగా వుండకూడదు. ఒక పక్క అందరికీ ఆరోగ్యం వంటి లక్ష్యాలని అమలుచేస్తామని ప్రకటిస్తూ, మరోపక్క పర్యావరణానికి అత్యంత ప్రమాదభరితమైన ‘యురేనియం గనుల తవ్వకాల’ కోసం అన్వేషించడం, అనుమతులు తీసుకురావాలని ప్రయత్నించడం, దేశవ్యాపితంగా అణువిద్యుత్‌ ‌కేంద్రాల ఏర్పాటు చేస్తామనటం, వాటికోసం తెలంగాణ లోని విలువైన ‘నల్లమల’ లాంటి అడవులను విధ్వంసం చేయాలనుకోవడం, అంతర్జాతీయ సమాజం ముందు సంతకం పెట్టిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ‘ఉల్లఘించటమే’!

అందరికీ సమాన, నాణ్యమైన విద్య నాలుగో లక్ష్యం. కానీ, ఇప్పటికీ బడి మెట్లు ఎక్కని సమూహాలు మనదేశంలో చాలా వున్నాయి. ఏ సామాజిక అసమానతలు వారిని బడి వైపుకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాయి? ఇప్పటికీ పేద, జెండర్‌, ‌వికలత్వ, ఆదివాసీ, విపత్కరమైన వృత్తుల్లో జీవించే (సఫాయి పనివారు, సెక్స్ ‌వృత్తి లో వుండే వారు, ట్రాన్స్ ‌జెండర్‌ ‌సమూహాలు మొదలైనవారు) వారి పట్ల అనేక అసమానతలు వ్యవస్థీకృతంగా నడుస్తున్న మాట వాస్తవం కాదా?జెండర్‌ ‌సమానత్వం ఐదో అంశం. స్త్రీలు, ఆడపిల్లల పట్ల, ట్రాన్స్ ‌జెండర్‌ ‌సమూహాల పట్ల ఎంత హింసాత్మకమైన పరిస్థితులు వున్నాయో మనకి 2017 జాతీయ నేర గణాంకాల వివరాలు తెలుపుతాయి. సమాజంలో లైంగిక హింస, అత్యాచారాలు ఎంత తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయో ఈ గణాంకాలు ఒక ఉదాహరణ. ముప్ఫై మూడువేల అత్యాచార సంఘటనలు దేశవ్యాపితంగా నమోదు అయ్యాయి. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఈ సంఘటనల్లో 93% మంది బాధితులకు తెలిసినవాళ్లే నేరాలకు  పాల్పడిన వ్యక్తులు. ఇవి, పోలీసు స్టేషన్‌, ‌కోర్టు వరకూ వచ్చినా గానీ, కుటుంబ పరువు, బెదిరింపుల వల్ల నేరస్థులు ఏ శిక్ష లేకుండానే బయటకు వచ్చేస్తున్నారు.

మరోవైపు, ఈ నేరాల మూలాలు ఎక్కడైతే వున్నాయో వాటి గురించి పట్టించుకోకుండా, వీటి నిర్మూలనకు అవసరమైన వ్యవస్థాపరమైన అంశాలను పట్టించుకోకుండా, అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయకుండా ‘కేవలం ఉరిశిక్ష’ అనే ఉన్మాదాన్ని ప్రచారంలో పెట్టటం వల్ల స్త్రీలు, పిల్లలు ప్రాణాలతో కూడా మిగలటం లేదు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే క్రమంలో నేరస్తులు బాధితుల ప్రాణాలను తీసేస్తున్నారు. అంటే, ఇక్కడ మరణశిక్ష బాధితులకే పడుతోంది. తెలంగాణా రాష్ట్రంలో ‘తక్షణ న్యాయం’ పేరిట ‘దిశ’ హత్యాచారం కేసులో అనుమానితులను పోలీసులు ఎన్కౌంటర్‌ ‌పేరిట చంపేయటం అనేది అప్రజాస్వామిక చర్యే కాకుండా, సమస్య మూలాల మీద నుంచీ ప్రజల దృష్టిని మళ్ళించే అంశం కూడా! దీనిని తీవ్రంగా తీసుకున్న తెలంగాణా హై కోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌మహిళా, సామాజిక, హక్కుల కార్యకర్తలు రాసిన ఉత్తరాన్ని సుమోటోగా తీసుకుని విచారిస్తున్న సందర్భంలో, ‘‘ప్రపంచమంతా ఈ అంశంలో ఇక్కడి న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఈ అంశం లో  ఎంత నిష్పక్షపాతంగా స్పందిస్తాయని వేచి చూస్తున్నారు! మనం మన నిజాయితీ ని నిరూపించుకోవాల్సిన సందర్భం ఇది’’ అని వ్యాఖ్యానించడం అంటేనే చట్ట పరిధులను దాటి పోలీసులు వ్యవహరించారని అర్ధం చేసుకోవాలి. వ్యవస్థలను ఏర్పాటు చేయటమంటే ఎన్కౌంటర్స్ ‌కాదని, మహిళా కమిషన్‌ ‌లాంటి వ్యవస్థల ఏర్పాటు, అవి నిస్పక్షపాతంగా పనిచేసే వాతావరణం కల్పించడం అని తెలంగాణా ప్రభుత్వానికి అర్థమయ్యేట్టు ఎవరు చెప్పగలరు? ఇంకా పన్నెండు అంశాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో వున్నాయి. ఈ పదిహేడు అంశాలనీ ఎలా సాధిస్తారనే దానిపట్ల ఒక రోడ్‌ ‌మ్యాప్‌  ‌మన భారతదేశానికి లేదు. రాజకీయ నిబద్ధత లేకుండా, చిత్తశుద్ధి లేకుండా కేవలం అంతర్జాతీయ వేదికల మీద ఆర్భాటంగా సంతకాలు చేసి, ఆచరణలో తమ హక్కుల కోసం గళమెత్తుతున్న, ప్రశ్నిస్తున్న ప్రజాసమూహాల మీద, భారత రాజ్యంగ విలువల రక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులు మీద, యువ పౌరుల మీద  తీవ్ర నిర్బంధాన్ని అమలుచేయటం అంటేనే, ప్రభు త్వాల అజండా సుస్థిర మానవాభివృద్ధి కాదనేది స్పష్టం!.

కె. సజయ
సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్

Leave a Reply