Take a fresh look at your lifestyle.

ఎపిలో కొత్తగా మరో 38 పాజిటివ్‌ ‌కేసులు

  • కేసుల సంఖ్య 2018కి చేరిక
  • 73 మంది కొరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్

‌విజయవాడ,మే 11 : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 38 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 2018 కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 7409 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 38 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. కొత్తగా అనంతపురం జిల్లాలో 8, చిత్తూరు జిల్లాలో 9(8 మంది తమిళనాడు నుంచి వచ్చిన వారు), గుంటూరు జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 9 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 73 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 998కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 45 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 975 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 998 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ ‌కాగా.. ఒక్కరోజే 73 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్లారు.

కర్నూలు-28, గుంటూరు-22, నెల్లూరు-14, కృష్ణ-05 కడప. శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 45గానే ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. వారం క్రితం రోజూ 70, 80కు పైగానే కేసులు నమోదవ్వగా..గత నాలుగైదు రోజులుగా కేసు లన్నీ 30, 40కు మించి పెరగలేదు.సగం కేసులు మాత్రమే నమోదవుతున్నాయ్‌. ‌దీన్ని బట్టి చూస్తే రాష్ట్రం వైరస్‌ ‌ముప్పు థాటి నుంచి కోలుకు ంటోందని చెప్పుకోవచ్చు. గత 24 గంటలుగా కేవలం 38 పాజిటివ్‌ ‌కేసులు మాత్రమే నమోద య్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2018కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 7,409 మందికి పరీక్షలు చేయగా 38మందికి కరోనా పాజిటివ్‌ ‌వచ్చిందని ఆరోగ్యశాఖ హెల్త్ ‌బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply