Take a fresh look at your lifestyle.

వైద్యరంగానికి సిఎం కెసిఆర్‌ ‌ప్రాధాన్యం

  • భిలార్‌పూర్‌లో పిహెచ్‌సీని ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు
  • ఆధునిక పద్ధతుల్లో రైతులు సాగు చేయాలి…రేజింతల్‌లో పాలిహౌజ్‌ను సందర్శించిన మంత్రి

ప్రజాతంత్ర, సంగారెడ్డి, ఏప్రిల్‌ 19 : ‌పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కోహీర్‌ ‌మండలం భిలాల్‌పూర్‌ ‌గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ ‌వైద్య రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అలాగే ప్రతి సబ్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణానికి రూ.20 లక్షలను మంజూరు చేస్తామని హావి ఇచ్చారు.

ఇక రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని, తద్వారా అధిక లాభాలు సాధించవచ్చని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రేజింతల్‌లోని స్వయంభు సిద్ధి వినాయకుడిని మంత్రి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పాలీ హౌస్‌ను సందర్శించారు. అందులో సాగవుతున్న రంగురంగుల క్యాప్సికం, గెర్కీన్‌ ‌పంటలను పరిశీలించారు. సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్‌, ఆదాయం వంటి వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఇక్కడ వినియోగిస్తున్న సాంకేతికత, సాగు పద్దతులపై స్థానిక రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి పాలీహౌస్‌ ‌నిర్వాహకులకు సూచించారు. అనంతరం మాణిక్‌రావుతో కలిసి మంత్రి జహీరాబాద్‌ ‌మున్సిపాలిటీలో పరిధిలో నగరబాటలో భాగంగా పలు వార్డుల్లో సైకిల్‌పై పర్యటించారు. క్షేత్రస్థాయిలో మహిళలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి హావి• ఇచ్చారు.

Leave a Reply