Take a fresh look at your lifestyle.

సైబర్‌ ‌భద్రతపై .. కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలి

‌కోవిడ్‌ ‌తదనంతరం ప్రపంచానికి టెక్‌ ‌సెల్యూషన్స్‌ను త్వరగా అభివృద్ధి చేసి అందించే సామర్థ్యం భారత్‌కు ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఐటీ పరంగా సానుకూల పరిణామాలను వివరించారు. అందుకుగాను ఎలక్టాన్రిక్స్ ‌తయారీ రంగాన్ని ఉధృతంగా ప్రోత్సహించా లన్నారు. కేంద్ర ఐటీశాఖ మంత్రిరవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ‌సమావేశంలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. డిజిటల్‌ ‌మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్‌ అక్షరాస్యత, డిజిటల్‌ ‌పాలనా సామర్థ్యాలను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కేంద్రమంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ… ఇంటర్‌నెట్‌పై మనం ఆధారపడటం పెరిగేకొద్ది నెట్‌వర్క్ ‌సామర్థ్యాలు, సైబర్‌ ‌భద్రత సమస్యలు ఉత్పన్నమౌతాయి.

కావునా వీటిపై దృష్టి సారించి బలోపేతం చేసుకోవాలన్నారు. చిన్న, మధ్యతరహా ఐటీ పరిశ్రమలను ఆదుకునేందుకు ఆర్థిక ప్రయోజనాల్ని చేకూర్చాల్సిందిగా ప్రోత్సాహాకాలను ప్రకటించాలన్నారు. విద్య, ఆరోగ్యం, వాణిజ్యం, ఎమర్జింగ్‌ ‌టెక్నాలజీస్‌ ‌మొదలైన వాటిలో డిజిటల్‌ ‌పరిష్కారాలను అన్వేషించడానికి ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల నాయకులు, మేధావులతో కలిపి వ్యూహాత్మక వర్కింగ్‌ ‌గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ ‌సూచించారు. ఈ సలహాను స్వీకరిస్తూ కేంద్రమంత్రి ఆమోదం తెలిపారు. తన సలహాలను అంగీకరించినందుకుగాను కేంద్ర మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌కు కేటీఆర్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply