Take a fresh look at your lifestyle.

మతం పేరిట చిచ్చులపై ఉక్కుపాదం

  • శాంతిభద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లేదు
  • విధ్వంసకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే
  • పాతబస్తీలో పలు అభివృద్ది పనలకు మంత్రి కెటిఆర్‌ ‌ప్రారంభం

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 19 : ‌రాష్ట్రంలో మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ‌హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కులం, మతం పేరు వి•ద రాజకీయం చేసే విధ్వంసకర శక్తులను, చిల్లరమల్లర వ్యక్తులను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ ‌సూచించారు. హైదరాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలో రూ. 495 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ ‌శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ…కేసీఆర్‌ ‌ప్రభుత్వం వొచ్చిన తర్వాత హైదరాబాద్‌లోనే కాదు, రాష్ట్రంలో కూడా మతం పేరిట రాజకీయాలు చేయలేదన్నారు. పనికిమాలిన పంచాయతీలు లేవని కూడా స్పష్టం చేశారు. కులాలు, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టలేదు. ఆ చిచ్చులో చలిమంటలు కాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు..చేయబోమని తేల్చిచెప్పారు.

కొన్నేండ్ల క్రితం హైదరాబాద్‌లో ప్రతి ఏడాది ఐదు నుంచి పది రోజుల పాటు కర్ఫ్యూ విధించేవారు. కానీ కేసీఆర్‌ ‌నాయకత్వంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడుకుంటున్నామని తెలిపారు. మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. హైదరాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలో ఒకే ఒక్క రోజు రూ. 495 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని కేటీఆర్‌ ‌తెలిపారు. ఓల్డ్ ‌సిటీ, న్యూ సిటీ అనే తేడా లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో మోజాంజాహీ మార్కెట్‌ను చూసి బాధపడేవాళ్లమని, ఇప్పుడు అదే మోజాం జాహీ మార్కెట్‌ను అభివృద్ధి చేశామన్నారు. కులీకుత్‌బ్‌షా అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌కు పూర్వ వైభవం తీసుకువొస్తామని, వారసత్వ సంపదను కాపాడుకుంటామని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఇప్పుడు ఏ ఎలక్షన్స్ ‌లేవని, అయినా..రూ. 495 కోట్లతో ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామంటే..అది పాతబస్తీ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

కొన్ని మెట్రో నగరాల్లో తాగునీటికి కష్టాలు ఉన్నాయని, హైదరాబాద్‌లో మాత్రం తాగునీరు, విద్యుత్‌కు ఇబ్బంది లేదన్నారు. పాతబస్తీలో అవసరమైన చోట రోడ్లను విస్తరిస్తామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న నోటరీ సమస్యను పరిష్కారిస్తామని కేటీఆర్‌ ‌తెలిపారు. జీవో నం 58, 59 తెచ్చి లక్ష మందికి హైదరాబాద్‌లో పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఉస్మానియా జనరల్‌ ‌హాస్పిటల్‌ని అభివృద్ధి చేస్తున్నామని, పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఈ హాస్పిటల్‌ ఎం‌తో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలను పెంచుతున్నామని కేటీఆర్‌ ‌తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ‌నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి మహ్మూద్‌ అలీతో కలిసి మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వి•ర్‌ఆలం చెరువు వద్ద మ్యూజికల్‌ ‌ట్రైన్‌ను కేటీఆర్‌ ‌ప్రారంభించారు. అలాగే ఎస్‌టీపీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలాపత్తర్‌లో పోలీస్‌స్టేషన్‌ ‌నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పారిశుధ్య కార్మికులకు జీతాలను రూ.8 వేల నుంచి రూ.17 వేలకు పెంచినట్లు చెప్పారు. అలాగే రూ.108 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన బహదూర్‌పుర ఫై ఓవర్‌, ‌రూ.35కోట్లతో చార్మినార్‌ ‌వద్ద ముర్గీచౌక్‌ ‌పునరుద్ధరణ, రూ.30 కోట్లతో సర్దార్‌ ‌మహల్‌ అభివృద్ధి, రూ.297.30 కోట్లతో కార్వాన్‌ ‌నియోజకవర్గంలో సీవరేజీ పనులకు శంకుస్థాపన చేసారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా సర్దార్‌ ‌మహల్‌ను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. రూ.109 కోట్లతో బహదూర్‌ ‌పురా ఫ్లై ఓవర్‌ను నిర్మాంచామని అన్నారు. మిరాలం చెరువు వద్ద ఎస్‌టీపీ నిర్మాణానికి శంకుస్థాపన, ట్రాన్స్ఫర్‌ ‌స్టేషన్‌, ‌కలెక్షన్‌ ‌పాయింట్‌ను ప్రారంభించామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Leave a Reply