Take a fresh look at your lifestyle.

పిల్లలు ఆడుకునేందుకు.. పెద్దలు వ్యాయామం చేసేందుకు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఒకప్పటి హైదరాబాద్‌ వేరు.. ప్రస్తుత హైదరాబాద్‌ మహానగరం వేరు. నగర జనాభా లక్షలు దాటి కోట్లకు పరుగులు పెడుతుండటంతో భాగ్యనగరం రోజురోజుకు విస్తరిస్తూనే ఉన్నది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నదని కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గం లోని కే.పి.హెచ్.బి కాలనీ  డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి 43వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కె.పి.హెచ్.బి కాలనీలోని చిల్డ్రన్స్ పార్కులను, మహిళా పార్కులను ఏర్పాటు చేశామని డివిజన్లోని మంచినీటి సమస్య లేకుండా చేశామని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని అందులో భాగంగానే కే.పి.హెచ్.బి డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు, మంచినీటి సమస్యతో పాటుగా మహిళల కోసం ప్రత్యేకమైన పార్కులను చిన్నపిల్లల కోసం చిల్డ్రన్స్ పార్కులను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు అందిస్తున్న బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని అన్నారు.

Leave a Reply