Take a fresh look at your lifestyle.

19‌న మరో అల్పపీడనం

రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం
వెల్లడించిన హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం

భారీ వర్షాలతో విలవిల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. మూడు రోజులు కుండపోతగా కురిసిన వర్షాలతో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగర ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం శుక్రవారం మరో హెచ్చరిక జారీ చేసింది. ఈమేరకు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం సీనియర్‌ ‌సైంటిస్ట్  ‌రాజారావు పేరిట విడుదల చేసిన ప్రకనటలో ఈనెల19న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడిం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వెంట ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర ఆనుకుని ఉన్న దక్షిణ కొంకణ్‌ ‌ప్రాంతాలలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది.

ఈ ప్రభావంతో శని, ఆది వారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. వాయుగుండం ఇప్పటికే అరేబియా సముద్రంలో కలసి పోయినప్పటికీ అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కారణంగా శనివారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే, ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకూ కొన్ని ప్రాంతాలలో ఉరుములు, వర్షాలతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇటు అల్ప పీడన ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 1.5 కి.మీల నుంచి 3.1 కి.మీ.ల ఎత్తు మధ్య కొనసాగుతూ రాష్ట్రంలో అక్కడక్క్డడా భారీ వర్షాలకు కారణం కానుంది. ఇది క్రమేపీ పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉందని ఆయన వివరించారు.

Leave a Reply