- 24 డంటల్లో కొత్తగా 63,371 మందికి పాజిటివ్..895 మంది మృతి
- రాష్ట్రంలో కొత్తగా 1,554 పాజిటివ్ కేసులు
దేశవ్యాప్తంగా కొరోనా విజృంభణ రోజురోజుకు కొంత తగ్గుతున్నా కొత్తగా చెపుకోదగ్గ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 63,371 మందికి పాజిటివ్ రాగా, 895 మంది మరణించారు. దీంతో మొత్తం కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73,70,469కి చేరింది. వీటిలో 8,04,528 యాక్టివ్ కేసులుండగా.. 64,53,780మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి 1,12,161 బాధితులు మంది మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా గురువారం 10,28,622 నమూనాలను పరీక్షించగా, అక్టోబర్ 15 వరకు దేశంలో మొత్తం 9,22,54,927 మందికి కొరోనా పరీక్షలు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ ప్రకటించింది.
రాష్ట్రంలో కొత్తగా 1,554 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కొత్తగా 1,554 కొరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఏడుగురు వ్యక్తులు వైనస్తో మృతి చెందారు. రాష్ట్రంలో కొరోనా పాజిటివ్ కేసులు 2,19,224కి చేరుకున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు కొరోనాతో 1,256 మంది మృతి చెందింది. 23,203 యాక్టివ్ కేసులుండగా.. 1,94,653 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 37,46,963 కొరోనా పరీక్షలు నిర్వహించారు.