Take a fresh look at your lifestyle.

మానవ హక్కుల పరిరక్షణలో మీడియాపాత్ర కీలకం

టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరణ సభలో జస్టీస్ చంద్రయ్య
ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా పిలువబడుతున్న మీడియా… హక్కుల పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ, వాటి పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమీషన్ ఛైర్మెన్ జస్టీస్ చంద్రయ్య పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం బషీర్ బాగ్ లోని దేశోధ్ధారక భవన్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మీడియా డైరీ-2021ను ఆయన ఆవిష్కరించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జస్టీస్ చంద్రయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, మనవాహక్కులను పరిరక్షించడమంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించడమే అని అన్నారు. ప్రజల పక్షపాతిగా నిలబడే జర్నలిస్టులకు కష్టాలు సహజమేనని, అధైర్య పడకుండా వాటిని ఎదుర్కొన్నప్పుడే సమాజంలో వారికి మంచి గుర్తింపు,

- Advertisement -

ప్రజల్లో విశ్వాసం దక్కుతుందని ఆయన సూచించారు. మంచి సమాచారంతో డైరీని రూపొందించిన టీయూడబ్ల్యూజే ను ఆయన అభినందించారు. ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 50 ఏండ్ల దేశ చరిత్రలో గడిచిన సంవత్సరం అత్యంత క్రూరమైందని, ఎందరికో విషాదాన్ని మిగిల్చిందని, 60 మంది జర్నలిస్టుల హత్యలు, వందల సంఖ్యలో జర్నలిస్టుల కోవిడ్ మరణాలతో జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, పీసీఐ సభ్యులు ఎం.ఏ.మజీద్, ఐజేయూ నాయకులు వై.నరేందర్ రెడ్డి, అమర్ నాథ్, కె.సత్యనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply