Take a fresh look at your lifestyle.

ఆదర్శంగా నిలుస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుడు

జగదేవ్ పూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:జగదేవపూర్ ఆదర్శ పాఠశాలలో టీజీటీ తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న వి.నరేందర్ గ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచిన ఫలితం విదితమే. ఈ ఉపాధ్యాయుడు తన దృష్టిని ఇతర ప్రభుత్వ పాఠశాలలపై కూడా సారించారు.మార్కుక్ మండలం లోని అంగడి కిష్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు సుమారు 20 వేల రూపాయల విలువైన నాలుగు బ్రాండెడ్ ఫ్యాన్లు, 176 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, మరియు 35 మంది విద్యార్థులకు పెన్సిల్ లు వితరణ చేసి ప్రభుత్వ పాఠశాల  బలోపేతానికి కృషి చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ, ఆదర్శ పాఠశాలల్లో అత్యుత్తమ నాణ్యమైన విద్య లభిస్తుందని, మంచి సౌకర్యాలు , నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, ఉన్నత అవకాశాలు ఉన్నాయని,ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సదుపాయాలన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల విద్యాశాఖాధికారి ఉదయభాస్కర్ రెడ్డి , గ్రామ సర్పంచ్ దుద్దెడ రాములు గౌడ్ , పేరెంట్ కమిటీ ఛైర్మన్ బాల్ రెడ్డి , ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి ,మాజీ ఛైర్మన్ కనకయ్య , పాఠశాల హెడ్ మాస్టర్ ఓంకార్ రాధాకృష్ణ , ఉపాధ్యాయులు రామకృష్ణ రెడ్డి ,చిన్ని కృష్ణ , హారిక తల్లితండ్రులు ,ప్రజాప్రతినిధులు పాల్గొని  వి.నరేందర్ ను అభినందించారు.

Leave a Reply