Take a fresh look at your lifestyle.

అన్నదాతల ఆత్మహత్యలపై రికార్డులు లేవు

రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో కిషన్‌ ‌రెడ్డి
‌రైతుల ఆత్మహత్యల గురించి ప్రభుత్వం దగ్గర డేటా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్‌ ‌రెడ్డి తెలిపారు. రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రైతు ఆత్మహత్యలపై డేటాను సేకరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నిలిపివేశాయన్నారు.  రైతులు ఆత్మహత్యలకు సంబంధించి నేషనల్‌ ‌కైమ్‌ రికార్డ్స్ ‌బ్యూరో ఎన్‌సీఆర్‌బీ వద్ద డేటా లేదన్నారు.

మరో ప్రశ్నకు బదులిస్తూ.. గత అయిదేళ్లలో ఎన్‌ఎస్‌ఏ.. ‌ఢిల్లీలో ఒక్క కేసును కూడా రిజిస్టర్‌ ‌చేయలేదన్నారు. నేషనల్‌ ‌సెక్యూర్టీ యాక్ట్‌ను రద్దు చేసే ఆలోచన కేంద్రానికి లేదని మంత్రి కిషణ్‌ ‌రెడ్డి తెలిపారు.  11 రాష్టాల్లోన్రి 90 జిల్లాలు వామపక్ష తీవ్రవాద ప్రభావానికి లోనయ్యాయని, 2019లో 61 జిల్లాలో తీవ్రవాద ఘటనలు జరిగాయని, 2020 తొలి అర్థభాగంలో 46 జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు మంత్రి కిషణ్‌ ‌రెడ్డి వెల్లడించారు.

Leave a Reply