Take a fresh look at your lifestyle.

అర్ధరాత్రి నుండే మంత్రి చొరవ…

సిద్ధిపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పని గురించి, చొరవ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆపద అనగానే ఎవరికైనా ఠక్కున గుర్తుంచే పేరు తన్నీరు హరీష్‌రావే. లోకలా..నాన్‌ ‌లోకలా అని లేదు. ఎవరైనా తనకు ఆపద ఉందని రాత్రయినా, అర్ధరాత్రయినా….వాట్సాప్‌ ‌మెస్సెజ్‌ ‌పంపినా లేదంటే కనీసం ఆయనకు సమాచారం చేరితే చాలూ స్పందించే నేత హరీష్‌రావు తాజాగా…సిద్ధిపేటలో జరిగిన మూడు సంఘటనలపై
ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని దర్గపల్లి వాగులో కొట్టుకుపోయిన కారు సంఘటనపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు హరీష్‌రావు. సంఘటన జరిగి విషయం తెలిసిన మరుక్షణమే జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి, పోలీస్‌ ‌కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవిస్‌, ‌ఫైర్‌ అధికారులను అప్రమత్తం చేసి వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రస్తుతం వాగులో కొట్టుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ను కాపాడేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, అధికారులందరూ సంఘటనస్థలం వద్దే ఉండాలని అన్ని చర్యలు తీసుకోవాలి ఆదేశించారు. మొన్నటికి మొన్న బస్వాపూర్‌ ‌వాగులో కొట్టుకుపోయిన లారీ డ్రైవర్‌ ఆచూకీపై గాలింపు చర్యలపై, అదేవిధంగా రాఘవపూర్‌ ‌గ్రామానికి చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తి నిన్న మాటిండ్ల గ్రామంలో చెక్‌ ‌డ్యామ్‌లో కొట్టుకుపోయిన సంఘటనపై  ఎప్పటికప్పుడు అధికారులను, ప్రజాప్రతినిధులను  అప్రమత్తం చేస్తూ …నిరంతరం రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీష్‌రావుకు ఏదైనా సమస్య ఉందని దృష్టికి వచ్చిన వెంటనే రాత్రా, అర్ధరాత్రా అని చూడకుండా సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూనే, ఆదేశాలు కూడా ఇస్తున్న మంత్రి హరీష్‌రావుకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Leave a Reply