Take a fresh look at your lifestyle.

ఆమనగల్లు అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 19 : కల్వకుర్తి నియోజకవర్గంలో అతి పెద్ద మండలమైన ఆమనగల్లును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి మాత్రం ఆపేదే లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకబడ్డ ఆమనగల్లును తాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ముందు ఉంచుతానన్నారు. ఇందులో భాగంగానే రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రెండున్నర కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం, ఒక కోటి 50 లక్షలతో గ్రంథాలయం నూతన భవనం ఏర్పాటు టి యు ఎఫ్ ఐ డి సి నిధుల ద్వారా రూ.15 కోట్లు మంజూరు చేసి ఆమనగల్ మున్సిపాలిటీలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా నూతనంగా పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగిందని ఈ సంవత్సరం నుండే తరగతులు ప్రారంభించడం జరుగుతుందన్నారు, రూ. 6 కోట్ల 50 లక్షలతో ఆమనగల్లు సురసముద్రం చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అదనంగా 2. 50 కోట్లతో చెరువును ఆధునికరించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్న పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. మున్సిపాలిటీలోని ఆరో వార్డులో సిసి రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నానని అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గుర్రం గుట్ట కాలనీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీల ఏర్పాటుకు రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులను ఎమ్మెల్యే బిఆర్ఎస్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అనురాధపత్యానాయక్, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాములు యాదవ్, చుక్క నిరంజన్ గౌడ్, వెంకటయ్య, సాయిలు, వడ్డే వెంకటేష్, ఖాదర్, ఖలీల్, రమేష్ నాయక్, భాస్కర్, మల్లేష్, పూసలి సత్యం, గణేష్, తోట కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply