ఇప్పుడు నిజంగా
లోకమంతా నిస్తేజం నిండుకుని
మనసంతా ఆందోళనమబ్బులు కమ్ముకున్నాయి
వేసే ప్రతి అడుగులో భయం
మనం అనే మాట మాయమయ్యిందిపుడు
ఎవరికివారే యమునాతీరే చందంగా
అప్యాయతల పలకరింపులన్ని దూరంనుండే
చరవాణి మనల్ని కలిపే వారథిపుడు
సాంకేతికంగానే వేడుకలన్నీ
దూరమైన ఆప్తుల స్నేహబంధాలెన్నో
తిరిగిరాని తీరం చేరారు
కడసారి చూపులేకుండానే
కన్నీటి చుక్కలు కూడా దిగులుతో
గుండెనోదారుస్తున్నాయ్
సంతోషం పెదవులనిడిచి సేదతీరుతోంది
– సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు, 9010480557.