Take a fresh look at your lifestyle.

వంగివంగి దండం పెట్టే  రోజుల్లోనే శివంగిలా గర్జించిన ఐలమ్మ

ప్రజాతంత్ర  చేవెళ్ల డివిజన్ సెప్టెంబర్ 26: చేవెళ్ల మండల కేంద్రంలో వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం రజాకారులను భూస్వాములును ఎదురించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.తొలి భూ పోరాటానికి సామాజిక న్యాయానికి నాంది పలికిన ధైర్య శైలి వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఐలమ్మ వీరత్వాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు. వంగి దండాలు పెట్టే రోజుల్లో శివంగిలా గర్జించింది అన్నారు.చాకలి ఐలమ్మ కొంగు నడుముకు చుడితే దొరతనం తోక ముడిచింది.ఆమె కొడవలి చేతబడితే పిడిత జనం కదిలి వచ్చారు.ఆడదాని అలుసుగా చూసిన కంట్లో నలుసైందని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.ఐలమ్మ ధైర్య సాహసాలను యువతరం ఆదర్శంగా తీసుకొని తన సొంత ఉపాధి పైన మనుగడ కొనసాగించాలని అప్పుడే సమాజంలోని అన్యాయాన్ని ఎదిరిస్తామని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి విజయలక్ష్మి రమణారెడ్డి,వైస్ ఎంపిపి కర్నె శ్రీశైలం,పెద్దోళ్ల ప్రభాకర్, నాగార్జున రెడ్డి,రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply