Take a fresh look at your lifestyle.

కొరోనా పై ప్రజలు అప్రమత్తంగా లేరు ..!

  • బాధ్యతారాహిత్యం వల్ల వైరస్ విస్తరిస్తుంది 
  • రాజ్యసభలో చర్చ సందర్భంగా మంత్రి హర్షవర్ధన్‌
 ‌ప్రజల బాధ్యతా రాహిత్యంతోనే కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి జరుగుతోందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా సాగడం వల్లనే  వ్యాప్తి తీవ్రంగా ఉందన్నారు. కొరోనా తగ్గిందన్న భ్రమలో ఉన్న  ప్రజలు తగు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. గురువారం రాజ్యసభలో కొరోనాపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మూడు వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఏడాది భారత్‌లో ఒక వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వస్తుందన్నారు.
దేశంలో అన్‌లాక్‌ ‌నాటి నుంచి ప్రజలు వైరస్‌ ‌తగ్గిందని, మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని భావించారన్నారు. దీంతో వైరస్‌ ‌వ్యాప్తి జరుగుతోందన్నారు. వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వచ్చే వరకు మాస్క్, ‌భౌతిక దూరమే సామాజిక టీకాలని అన్నారు. కొవిడ్‌ ‌పరీక్షల్లో త్వరలోనే అమెరికాను దాటనున్నట్లు తెలిపారు. వలస కార్మికులు కొంతకాలంగా సమస్యలను ఎదుర్కొన్నారని, అయితే వారికి సహాయమందించేందుకు కేంద్ర హోంశాఖ, రైల్వేలు గణనీయమైన చర్యలు తీసుకున్నాయని హర్షవర్ధన్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply