Take a fresh look at your lifestyle.

కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లు

Ongoing municipal election nominations
కలెక్టర్‌ ‌కు ఫారం-ఎను అందజేస్తున్న ఎమ్మెల్యే సునీతా

మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా నామినేషన్లు మొత్తం 6 దాఖలయ్యాయని మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌బాలశంకర్‌ ‌తెలిపారు. గురువారం భూదాన్‌ ‌పోచంపల్లి పురపాలక కేంద్రంలోని వినోభా బావే మందిరంలో నామినేషన్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేశారు.నామినేషన్‌ ‌లు వేసిన వారు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నుండి వేముల సుమన్‌ (6‌వ వార్డు), బిజెపి నుండి చిక్క కృష్ణ(7వ వార్డు) ఇండిపెండెంట్‌ ‌నుండి సరికొండ రవితేజ (7వ వార్డు) గుర్రం సంపూర్ణ(9వ వార్డు) జల్దీ అంజమ్మ(9వ వార్డు) కొంకి లావణ్య లక్ష్మీనారాయణ(6వ వార్డు) మొత్తం 13 వార్డులకు గాను ఐదు నామినేషన్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేసి ఐదుగురు రిటర్నింగ్‌ అధికారులను, ఐదుగురు అసిస్టెంట్‌ ‌రిటర్నింగ్‌ అధికారులను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. నామినేషన్‌ ‌దాఖలు చేసుకునే అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా హెల్ప్ ‌డెస్క్ ‌ను ఏర్పాటు చేశామని తెలిపారు . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై రాజు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌మేనేజర్‌ ‌రాజేష్‌, ‌రిటర్నింగ్‌ అధికారులు ఎజాజ్‌ అలీ ఖాన్‌, ‌జంగారెడ్డి, పురుషోత్తం రెడ్డి, హరీష్‌, ‌సీనియర్‌ అసిస్టెంట్‌ ‌లోకేశ్వర్‌ ‌రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

ఫారం-ఏ ను ఎన్నికల అధికారికి అందజేసిన ఎమ్మెల్యే సునీత
యాదాద్రి భువనగిరి: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఫారం-ఎను ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతమహేందర్‌ ‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు గురువారం తన చాంబర్‌లో అందజేశారు. ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో కౌన్సిలర్‌ ‌గా పోటీ చేయనున్న అభ్యర్థులకు బి-ఫారం అందజేయు అధికారాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఫారం-ఎ ద్వారా ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత కట్టబెట్టారు. తద్వారా బి-ఫారాలను ఆలేరు శాసనసభ్యురాలు అభ్యర్థులకు జారీ చేస్తార. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఫారం-ఎ ను ఆమె గురువారం కలెక్టర్‌ ‌జిల్లా ఎన్నికల అధికారికి అందజేశారు.

Tags: yadadri bhongir, form A, mla sunitha, collector anitha ramchandran

Leave a Reply