Take a fresh look at your lifestyle.

దొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు బీఆర్‌ఎస్‌ వ్యవహారం

  • సాగునీటి సంక్షోభానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్‌
    ఇంజనీర్ల వ్యవస్థ సంక్షోభంలో పడేలా డిజైన్‌
    మేడిగడ్డ కుంగడం మూడు పిల్లర్ల విషయం కాదు
    బిఆర్‌ఎస్‌ ‘ఛలో మేడిగడ్డ’ పై టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎ.కోదండరామ్‌ విమర్శ

నాంపల్లి, ప్రజాతంత్ర, మార్చి 01 : మేడిగడ్డ కుంగడం మూడు పిల్లర్ల విషయం కాదని, స్లాబ్‌ ప్రభావం మిగితా పిల్లర్లు మీద ఉంటుందని టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎ.కోదండరామ్‌ అన్నారు. ఈరోజు బీఆర్‌ఎస్‌ చేస్తుంది చూస్తుంటే దొంగే దొంగ..దొంగ అని అరిసినట్లు ఉందని అన్నారు. ఏదో కేవలం సాంకేతిక లోపం కాదు, ప్రణాళిక, నాణ్యత, డిజైన్‌, నిర్వహణ లోపం ఉందన్నారు. ప్రాజెక్ట్‌ సాగు నీటి సంక్షోభానికి కారణం అయ్యిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై శుక్రవారం టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..18 లక్షల ఏకరాలకు నీళ్ళు అందించేందుకు ఏర్పడ్డ ప్రాజెక్ను తెలంగాణ రాష్ట్రంలో ఇంజన్లీ వ్యవస్థ సంక్షోభంలో పడేలా ఈ ప్రాజెక్ట్‌ డిజైన్‌ చేశారని మండి పడ్డారు.

ఇంజనీర్స్‌ని తొందర పెట్టడమే కాదు సొంత ఆలోచనతో గత ప్రభుత్వం డిజైన్స్‌ మార్చడం వల్లే ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో లోపాలు బయట పడ్డాయన్నారు. సిడబ్ల్యూసి హెచ్చరికలు చేసిన బేఖాతరు చేస్తూ నిర్మాణం చేయడం తెలంగాణలో ఆర్థిక సంక్షోభానికి ఈ ప్రాజెక్ట్‌ కారణం అయ్యిందన్నారు. ప్రాజెక్ట్‌తో ఒక ఏకరానికి నీరు ఇచ్చేందుకే 46 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కాళేశ్వరం పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకుండానే గత ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. సాగు నీటి వ్యవస్థ ఇలా జరగడానికి వీలు లేదన్నారు. మల్లన్న సాగర్‌ కట్టినా అందులో నీళ్లు నింపడానికి వీలు లేకుండా ఉందన్నారు. ఈరోజు బీఆర్‌ఎస్‌ నాయకులు మేడిగడ్డకు పోవడం అవినీతి చేసిన వల్లే అద్దంలో మొహం చుసుకున్నట్లు ఉంది. మార్చ్‌ 10న టీజెఎస్‌ ఆధ్వర్యంలో నీళ్ళు, నిధులు పైన ఓపెన్‌ డెబేట్‌ పెట్టేందుకు ప్లాన్‌ చేస్తోందన్నారు. 60 వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉపయోగం ఉందన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ కి తీవ్రమైన సమస్యగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మారిందన్నారు.

Leave a Reply