Take a fresh look at your lifestyle.

ఆరుగురు నక్సలైట్ల అరెస్ట్ ‌రెండు రివాల్వర్లు స్వాధీనం

సిపిఐ ఎంఎల్‌ ‌రాంచంద్రన్‌ ‌గ్రూపునకు చెందిన ఆరుగురు నక్సలైట్లను మండెపల్లి శివారులో అరెస్ట్ ‌చేసినట్లు  సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్‌ ‌వెల్లడించారు.సోమవారం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్‌కు చెందిన సుద్దపల్లి సుధాకర్‌,‌ధర్మారం గ్రామానికి చెందిన  ఊరడి లింగయ్య,దేశాయిపల్లికి చెందిన కంకణాల కనకయ్య,రామలక్ష్మణ పల్లికి చెందిన బోయిని దేవయ్య,పెద్దలింగాపూర్‌ ‌కు చెందిన పయ్యావులు గోవర్ధన్‌,‌జక్కాపూర్‌కు చెందిన అబటి విఠల్‌లను అరెస్ట్ ‌చేసినట్లు తెలిపారు.వీరంతా జనశక్తి రాజన్నవర్గం నుండి విడిపోయి,రామచంద్రన్‌ ‌గ్రూప్‌ ‌పేరిట బెదిరింపులకు పాల్పడుతూ లక్షలాదిరూపాయలను వసూలు చేస్తున్నారని చెప్పారు.

పెద్దలింగాపూర్‌ ‌గ్రామానికి చెందిన ల్యాగల తిరుపతిని బెదిరించి 5లక్షల రూపాయలను పార్టికి చందాగా ఇవ్వాలని డిమాండ్‌ ‌చేసినట్లు అయన తెలిపారు.ఈ క్రమంలోనే మరికొంత మంది వద్ద డబ్బు వసూలు చేయడానికి మండెపల్లి శివారులో సమావేశం అవుతుండగా తమకు అందిన సమాచారం మేరకు అక్కడకు చేరుకుని వారిని అరెస్ట్ ‌చేసినట్లు చెప్పారు.వారినుండి రెండు దేశవాళి రివాలర్లు,5 రివాల్వరు రౌండ్ల బుల్లెట్లు,6 మొబైల్స్,‌రెండు బైకులు,పార్టి సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

Leave a Reply