Take a fresh look at your lifestyle.

మధ్యప్రదేశ్‌లో ఆరుగురు మంత్రులలతోపాటు 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా

మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. సోమవారం తన వర్గం ఎమ్మెల్యేలతో బెంగళూరుకు మకాం మార్చిన కాంగ్రెస్‌ ‌నేత జ్యోతిరాదిత్య సింధియా.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, ఆ వెంటనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. సింధియా రాజీనామా చేసిన వెంటనే.. ఆయన వర్గంలోని 19మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు.

ఈ మేరకు తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు పంపించారు. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230. అయితే ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే మృతి చెందడంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 228కి చేరింది. కాంగ్రెస్‌ 114, ‌బీజేపీ 107, స్వతంత్రులు 4, బీఎస్పీ 2, ఎస్పీ ఒక ఎమ్మెల్యే బలం కలిగిఉంది. కాంగ్రెస్‌కి స్వతంత్రులు, మిత్రపక్షాలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 19మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ‌ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

Leave a Reply