Take a fresh look at your lifestyle.

16‌న హైదరాబాద్‌ ‌వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు

  • తెలంగాణపై కాంగ్రెస్‌ ‌స్పెషల్‌ ‌ఫోకస్‌..‌భారీ ఎత్తున కార్యక్రమాలు
  • 17న విస్తృతస్థాయి వర్కింగ్‌ ‌కమిటీ భేటీ
  • 19న 119 నిమోజకర్గాల్లో ప్రచారహోరు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌4: ‌తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ ‌పార్టీ అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో పాగా వేయడం లక్ష్యంగా కార్యక్రమాలకు ప్లాన్‌ ‌చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలకు హైదరాబాద్‌ ‌వేదిక కానుంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ అధిష్ఠానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, సీడబ్ల్యూసీ ఏర్పాటు తర్వాత.. తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించిన వివరాలను పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ‌విడియాకు తెలిపారు. 16వ తేదీన జరిగే సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. 17వ తేదీన ఉదయం విస్తృత స్థాయి వర్కింగ్‌ ‌కమిటీ సమావేశం, సాయంత్రం హైదరాబాద్‌కు సవి•పంలో మెగా ర్యాలీ నిర్వహించ నున్నారు. భారీ ర్యాలీకి టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ అ‌గ్ర నేతలు పాల్గొంటారు. ఈ మెగా ర్యాలీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ శ్రీ‌కారం చుట్టనున్నది.

మెగా ర్యాలీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 5 గ్యారెంటీ హావి•లను ప్రకటించ నున్నది. మెగా ర్యాలీ అనంతరం… అదే రోజు సాయంత్రం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అ‌గ్రనాయకులు బస చేస్తారు. సెప్టెంబర్‌ 18‌న ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో నేతలు పాల్గొంటారు. పార్టీ విధి విధానాలపై కార్యకర్తలకు దిశానిర్ధేశర చేస్తారు. కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని వైఎస్‌ ‌షర్మిలారెడ్డి కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తన పార్టీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై సోనియా, రాహుల్‌లతో చర్చించారు. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డికి కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంతో సాయం చేసిందని.. షర్మిల సరైన నిర్ణయం తీసుకుంటారని కేసీ వేణుగోపాల్‌ ‌చెప్పారు.

రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసేందుకు షర్మిల కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే బాగుంటుందని తన అభిప్రాయం తెలిపారు.ఏపీ రాజకీయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ..ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారో లేదో తెలీదని కేసీ వేణుగోపాల్‌  అన్నారు.  సీడబ్ల్యూసీ సమావేశాలను తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈమేరకు టీపీసీసీ  వేదికను ఖరారు చేసింది.తాజ్‌ ‌కృష్ణాలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పరేడ్‌ ‌గ్రౌండ్‌లో టీకాంగ్రెస్‌ ‌బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నది. ఈ సందర్భంగా సోమవారం నాడు గాంధీభవన్‌లో వి•డియాతో టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ.. 6వ తేదీన హైదరాబాద్‌కు కేసీ వేణుగోపాల్‌ ‌వొస్తారని, సీడబ్ల్యూసీ సమావేశాలు ఎక్కడ పెట్టాలి, బహిరంగ సభ ఎక్కడ పెట్టాలో కేసీ వేణుగోపాల్‌ ‌డిసైడ్‌ ‌చేస్తారన్నారు. సీడబ్ల్యూసీ సమావేశానికి తాజ్‌ ‌కృష్ణా హోటల్‌, ‌సభ కోసం పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌పరిశీలిస్తున్నట్లు రేవంత్‌ ‌తెలిపారు.

Leave a Reply