Take a fresh look at your lifestyle.

ఉదయం 8నుంచి 12 గంటల వరకే బ్యాంకు పనివేళలు

50శాతం సిబ్బందితో పనిచేసేలా ఏర్పాట్లు
‌కొరోనా ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. తాజాగా బ్యాంకింగ్‌ ‌సెక్టార్‌పైనా దీని ప్రభావం పడింది. కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో గురువారం నుంచి మార్పు చోటు చేసుకోనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. కేవలం 50 శాతం మంది సిబ్బంది మాత్రమే విధులకు హాజరుకానున్నారు.

తాజా నిర్ణయంతో రేపటి నుంచి ఈ నెల 20 వరకు కేవలం 4 గంటలు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. కొరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ‌నుంచి బ్యాంకులు, ఏటీఎం సేవలకు మినహాయింపు నిచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply