Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌పొడిగింపు రాష్ట్రాల ఇష్టం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి
కొరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ‌విధించాక కరోనా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వాలు తీసుకున్న ఈ చర్యకు పూనుకున్న తర్వాతే కేసులు తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నారు.. అయితే, లాక్‌డౌన్‌ ‌పెట్టుకోవాలా? లేదా? అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.  జూన్‌ 30‌వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ‌పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని.. కానీ, నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రాలే అని అన్నారు.. ఇక, ప్రైవేట్‌ ‌దవాఖానా లు ప్రజల ముక్కుపిండి ఫీసులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి.. ఆస్తులు అమ్మి బిల్లులు చెల్లిస్తున్నారని..

అయినా ప్రాణంతో బతికి వస్తాడా అనేది మాత్రం అనుమానంగా ఉందన్నారు.. దీనిని కట్టడి చేయడానికి దవాఖానా ముందు వివరాలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నామని తెలిపారు. మరోవైపు ఆనందయ్య మందుపై కూడా స్పందించారు కిషన్‌రెడ్డి.. ఆనందయ్య మందు పై కేంద్రానికి విజ్ఞప్తిలు వచ్చాయన్న ఆయన.. రాష్ట్రం పరిశోధించి ఆయుష్‌ ‌డిపార్ట్ ‌మెంట్‌ ‌కి పంపిస్తే.. దానిని సప్లిమెంట్‌ ‌మెడిసిన్‌ ‌గా వాడే అవకాశం ఉందని తెలిపారు.. ఇక, రామ్‌ ‌దేవ్‌ ‌పతంజలి కూడా కోవిడ్‌ ‌మెడిసిన్‌ అనుమతి కోరినట్టు వెల్లడించారు.. ప్రజలకు మేలు జరుగుతుంది అంటే కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.. అయితే, కాక్‌ ‌టైల్‌ ‌మందు పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

Leave a Reply