Take a fresh look at your lifestyle.

ఏపార్టీకి వోటు వేయాలన్నది మీ ఇష్టం

  •  వోటు మాత్రం ఖచ్చితంగా వేయండి
  •  ప్రజాస్వామ్య బలోపేతానికి పార్టీలు కృషి చేయాలి
  •  ఉచితాలకు నేను వ్యతిరేకం
  •  మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
  •  మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లేదిలేదని స్పష్టం

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 23 : ఏ పార్టీకి వోటు వేయాలనుకుంటే ఆ పార్టీకి వోటు వేయండి…కానీ ప్రజలంతా వోటింగ్‌లో తప్పకుండా పాల్గొనాలంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. వోటు అన్నది మన హక్కు అని, అది ప్రజాస్వామ్యాన్ని నిలుపుతుందని అన్నారు.  అన్ని రాజకీయపార్టీలు ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయా లని సూచించారు. అలాగే వోటర్లు తమ వోటర్‌ స్లిప్‌ వేరిఫై చేసుకోవాలని, వోటు ఉందా లేదా అన్ని సరిచూసుకో వాలన్నారు. మంగళ వారం వెంకయ్యనాయుడు నివాసంలో వ్నిట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ విభూషణ్‌ స్వీకరించిన వెంకయ్య నాయుడును దిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ…తాను చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్‌ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

ఉప రాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భవించానని, అందుకే రాలేదని తెలిపారు. ఇకపై ప్రజలతో ఉంటానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను, ఇతర అంశాలను సోమవారం ప్రధానితో చర్చించినట్లు చెప్పారు. ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళనని తేల్చిచెప్పేశారు. సాధారణ రాజకీయాల గురించి స్పందిస్తూ ఉంటానని తెలిపారు. వొచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేసా ్తనన్నారు. కళాశాలలు, యూనివర్సిటీలు, ఐఐఎం అనేక సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. ప్రజా జీవితంలో ప్రతిఒక్కరు యాక్టివ్‌ గా ఉండాలని.. ఎవరి పని వారు సక్రమంగా చేయడమే దేశ భక్తి అని చెప్పుకొచ్చారు. నేతలు పార్టీలు మారడం ట్రెండ్‌గా మారిందని.. ఇది డిస్టబ్రింగ్‌ ట్రెండ్‌ అని వ్యాఖ్యలు చేశారు. పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరొచ్చన్నారు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదన్నారు. యాంటీ డిఫెక్షన్‌ లాను బలోపేతం చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతారో అవే మేనిఫెస్టోలో హావ్నిలుగా ఇవ్వాలని సూచించారు. చెట్లకు డబ్బులు కాయవనేది వాస్తవమన్నారు.

తాను ఉచితాలకు వ్యతిరేకమన్నారు. విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలని..ప్రజలు కూడా ఉచితాలను ప్రశ్నించాలని అన్నారు. అసభ్యంగా మాట్లాడేవారు, అవినీతి పరులను ప్రజలు తిరస్కరించాలని కోరారు. పార్టీకి తానిచ్చే స్థానం తన జీవితంలో మారదని, ఆర్టికల్‌ 370 రద్దు తాను రాజ్యసభ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆమోదం పొందడం జీవితంలో గొప్ప అంశమన్నారు. లోక్‌సభలో మెజారిటీ ఉన్నా మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టారని, సభను వాయిదా వేయకుండా నడిపించానని, శాంతియుతంగా చర్చల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిందని వెంకయ్య తెలిపారు. రాజకీయ పార్టీలు వారి సభ్యులను పార్లమెంట్‌ ప్రొసీడిరగ్స్‌ సరిగా జరిగేలా ట్రెయిన్‌ చెయ్యాలని, దేశం రోజు రోజుకు ముందుకు వెళ్తుందని, ప్రపంచం భారత్‌ వైపు చూస్తుందని, శత్రు దేశాలు భారత్‌ను చూసి ఓర్చుకోలేక పోతున్నాయని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

Leave a Reply