Take a fresh look at your lifestyle.

పని సొగసు దృశ్యం.!

రోజు…
పొద్దు పొడుపును
పోర్టికోలో కూర్చోని,
దిక్కుమాలిన
మొక్కడం కాదు గని
మింగడం నా దిన చర్య.!

ఇయ్యాల
సూర్య కాంతితో పాటు
చెమట కాంతిని స్పర్శించా.!

మా అపార్ట్ ‌మెంటును
ఆనుకొని
ఓ బంగ్లా నిర్మాణం జరుగుతుంది.

ఇరవై టన్నుల ఇసుక లోడు
మసుకులోనే వచ్చింది
ఇద్దరే మహిళలు
చేతులు పారలే పనిముట్లు.!

కొంగు నడుముకు చుట్టి
వంగిన నడుము ఎత్తకుండా
ఇసుకను కిందికి చిమ్ముతున్న
పని సొగసు దృశ్శం.!

ఒంటిలో చెటాకు కండలేని
వారి శరీరాలు
పని పల్లవిలో శృతి లయలా
కదులుతుంటే
ఇస్‌ ఇస్‌ ‌మంటు శ్రమ కావ్యం
వినిపిస్తుంది.!

వారి పెయ్యి చెమట
చెలిమలా మారిపోయింది.!
వారి ముఖము మీద
చెమట పూలు ఊరుతూ
జారిపోతున్నవి.!

పనిలో గనిలో
విపణి నిర్మాణంలో
మహిళల శక్తి
మ(ను) గాళ్లకు
ఆదిపత్య మృగాళ్లకు
సవాలు విసురుతుంది.!

పునరుత్పత్తే కాదు
ఉత్పత్తిలోను
మా చెమట విత్తులు
చిగురించి..
సమ సమాజాన్ని నిర్మిస్తం.!

– చిలువేరు అశోక్‌,9492443141
(ఇసుక డంపు చేస్తున్న ఇద్దరు మహిళల శ్రమ సౌందర్యం చూసి నా కలం స్పందన)

Leave a Reply