Take a fresh look at your lifestyle.

ప్రజల కోసం స్పందించే.. తీరిక లేదా..?

  • ఒక్క ఎంజిఎంలో 657 ఖాళీలున్నాయి
  • కేసీఆర్‌… ‌హాస్పిటల్‌కి ఈ ఆరేళ్ళల్లో ఏం చేశారు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

కొరోనా కష్ట కాలంలో జనాలను గాలికి వదిలేసినందుకు ప్రజలే మీ తోలువలుస్తారని ముఖ్యమంత్రికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. పేదల ఆరోగ్యం కోసం నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు ఎంజిఎం హాస్పిటల్‌ని నిర్మించాయని భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్ర హాస్పిటళ్లను పరిశీలిస్తున్న ఆయన నేతృత్వంలోని సిఎల్పీ బృందం బుధవారం వరంగల్‌లోని ప్రఖ్యాత ఎంజిఎం హాస్పిటల్‌ని పరిశీలించింది. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మల్లుతో పాటి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు, డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ ‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ ‌నాయకులు పాల్గొన్నారు. నాvxbటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు ఎంతో ముందుచూపుతో పేదల కోసం ఎంజిఎం హాస్పిటల్‌ని నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించిందని అన్నారు. ఈ ఆరేళ్ళ కాలంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఈ హాస్పిటల్‌ అభివృద్ధికి ఏమి చేయలేదని అన్నారు. మిగులు నిధులతో వచ్చిన రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడంతో పాటు సామాజిక తెలంగాణ నిర్మించవకోవచ్చు అనుకున్న ఆశలను కేసీఆర్‌ ఆడియాశలు చేశారన్నారు. ఉద్యమంతా ఉద్యోగాల కోసమే అన్న ఈటల రాజేందర్‌ ఇతర శాఖల్లో ఉద్యోగాల సంగతి పక్కన పెడితే నీ వైద్య శాఖలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని భట్టి అన్నారు. ఆసువుత్రుల్లో ఉన్న ఖాలీలను చూస్తుంటే.. నీ ఉద్యమం ఉద్యోగాల కోసం కాదని.. నీ పదవుల కోసం అన్న విషయం అర్థమవుతోందని అన్నారు. సిగ్గుపడాలి రాజేంద్ర ఇన్ని ఉద్యోగాలు ఒక్క ఎంజీఎం హాస్పిటల్‌లో ఖాళీగా పెట్టినందుకు అని భట్టి ఆగ్రహంగా అన్నారు. గులాబీ జెండా ఓనర్ల పోరు పక్కన పెట్టి.. పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలని భట్టి హితవు పలికారు.

ఈ అరున్నరేళ్లలో ఎంజీఎం హాస్పిటల్‌కి కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయింపులు జరపలేదని అన్నారు. ఇప్పుడున్న భవనాలు, సీటీ స్కాన్‌, ఎమ్మారై.. కూడా నాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవే. ఇన్నీళ్లలో కనీసం ఇక్కడ యాంజియోగ్రామ్‌ ‌కూడ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇక్కడ డాక్టర్లకు, సిబ్బందికి, పారిశుధ్య ఉద్యోగులకు కనీసం పిపిఈ కిట్లు కూడా లేవని భట్టి వివరించారు. కరోనపై పెద్దపెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కొరోనా విస్తృతి పెరుగుతున్న సమయంలో కలుగులో ఎలకలా ప్రగతి భవన్‌ ‌దాక్కున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కొరోనా స్తాయిపై మార్చిలోనే కాంగ్రెస్‌ ‌శాసనసభ పక్షం హెచ్చరించినా.. కొరోనా రమ్మన్నా రాదు, 22 డిగ్రీల వాతావరణంలో పేలిపోతుంది, మాస్కులు లేకుండా నేను నా ఎమ్మెల్యేలు పని చేస్తామని ముఖ్యమంత్రి ఒక జోకర్‌ ‌లా మాట్లాడారన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ఎవరైనా ప్రజల్లో తిరుగున్నారా అని భట్టి ఆగ్రహంగా ప్రశ్నించారు. 2016లో కేంద్రం పథకం కింద వరంగల్‌ ‌నగరంలో రూ.150 కోట్లతో అత్యాధునిక ఆస్పత్రిని నిర్మిస్తే రాష్ట్ర వాటా కింద రూ. 30 కోట్లు చెల్లించలేక హాస్పిటల్‌ని నిరుపయోగంగా మార్చారని భట్టి అన్నారు. ఇదేనా అద్భుతాలు చేయడం.. అని విమర్శించారు. దాదాపు 11 ఎకరాల్లో 20 అంతస్తులతో నిర్మించిన ఆసుపత్రిని ఖాళీగా పెట్టినందుకు ఈ ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ ఎ‌ర్రబెల్లి స్వర్ణ, ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌ ‌రావు, టీపీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్‌ ‌చైర్మన్‌ ‌కత్తి వెంకట్‌ ‌స్వామి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్‌, ‌పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్‌ ‌రావు, ఈ.వి శ్రీనివాస్‌ ‌రావు, టీపీసీసీ కార్యదర్శులు, కొత్తపల్లి శ్రీనివాస్‌, ‌మీసాల ప్రకాష్‌ , ‌డాక్టర్‌ ‌పులి అనిల్‌ ‌కుమార్‌, ‌టీపీసీసీ ఇర్గనైజింగ్‌ ‌సెక్రటరీ దుబ్బా శ్రీనివాస్‌, ‌టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి, సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు తక్కలపల్లి రాం మోహన్‌ ‌రావు, నల్గొండ రమేష్‌ ‌వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా మైనారిటీ చైర్మన్‌ ‌మహమ్మద్‌ ఆయుబ్‌, ‌టీపీసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్‌ ‌ప్రధాన కార్యదర్శి రాహత్‌ ‌పర్వీన్‌, ‌బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అద్యక్షుడు బంక సంపత్‌ ‌యాదవ్‌, ‌గ్రేటర్‌ ‌కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు పల్లె రాహుల్‌ ‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. సంగీత్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌తోట పవన్‌, ఎన్‌ ఎస్‌ ‌యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లకొండ సతీష్‌, ‌మహమ్మద్‌ ‌జమీరుద్దీన్‌ ‌తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply