Take a fresh look at your lifestyle.

శతాధిక వృద్ధురాలు తేలుకంటి యాదమ్మ మృతి

ముషీరాబాద్, జూన్ 12 (ప్రజాతంత్ర విలేఖరి) : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లో ఓ శతాధిక వృద్ధురాలు ఆకస్మికంగా మృతి చెందింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన ఇంచార్జి ఎంఈఓ తేలుకంటి ముత్తయ్య తల్లి తేలుకంటి యాదమ్మ(102) శతాధిక వృద్ధురాలు గాంధీనగర్ లోని హెబ్రోన్ చర్చీ వద్దగల ఓ అపార్టుమెంట్ లో ఉంటున్న తన పెద్దకుమారుడు అయిన తేలుకంటి అయిలయ్య ఇంట్లో శనివారం ఉదయం 8-30 గంటలకు ఆకస్మికంగా తన తుదిశ్వాస విడిచారు.
ఆమెకు ఇద్దరు కుమారులు ఐలయ్య, ముత్తయ్య, ఇద్దరు కూతుళ్లు అమృత, వెంకటలక్ష్మి ఉన్నారు. పెద్ద కుమారుడు అయిలయ్య గాంధీనగర్ లో మంగలి షాపు నడుపుతున్నాడు.

Leave a Reply