Take a fresh look at your lifestyle.

ఆరు గ్యారంటీలతో అందరికి సంక్షేమం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ప్రజలందరికీ సంక్షేమం సాధ్యమవుతుందనిపటాన్ చెరుకాంగ్రెస్
పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు సతీమణి కవిత ముదిరాజ్ అన్నారు.గురువారం  చిట్కుల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటిఇంటికి  ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను, అభివృద్ది ప్రణాళికలను గడప గడపకు వివరించారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు, రైతులకు, యువతకు విద్యార్థులకు పెద్దపీట వేసేలా ఆరు గ్యారంటీలు ప్రవేశ పెట్టిందన్నారు.మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం తో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.రైతు భరోసా కింద భూమి ఉన్న రైతులతో  పాటు కౌలు రైతులకు సైతం ఎకరాకు సంవత్సరానికి  15 వేల రూపాయల పంట సాయం అందించడంతో పాటు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12,000 సాయం చేస్తామన్నారు. రైతులకు పంట మద్దతు ధర కల్పించడంతో పాటు  వరి పంటకు క్వింటాలకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు.మూడవ గ్యారెంటీ కింద గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందించడంతోపాటు తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు.విద్యార్థులకు చదువులో ప్రోత్సహించడానికి విద్యకు సహాయం చేయడానికి 5 లక్షల రూపాయల విద్య భరోసా కార్డు అందిస్తామని, గ్రామాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లక్ష్యంగా ప్రతి మండలానికి ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధులకు వితంతువులకు వివిధ పథకం ద్వారా నెలకు 4000 రూపాయల పెన్షన్ అందించడంతోపాటు 10 లక్షల విలువైన రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ను కల్పిస్తామని భరోసా ఇచ్చారు.తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి ప్రజలంతా ఒక్క సారి కాంగ్రెస్ పార్టీ కి అధికారం అందించాలని కోరారు.నవంబర్ 30 న జరిగే ఎన్నికలలో చేతి గుర్తు మీద ఓటు వేసి నీలం మధు ముదిరాజ్ ని భారీ మెజార్టీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply