Take a fresh look at your lifestyle.

కొరోనా నివారణ చర్యలపై హైకోర్టులో విచారణ

  • వ్యాక్సినేషన్‌పై ధర్మాసనం ఆరా
  • 8 నాటికి స్టేటస్‌ ‌రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశాలు

అమరావతి,అగస్టు 31 : రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కేసులు పెరగడం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌పై ధర్మాసనం ఆరా తీసింది. 45 ఏళ్లు పైబడిన వారికి 90 శాతం వ్యాక్సినేషన్‌ ‌పూర్తి చేసినట్టు కోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. అలాగే మిగిలిన వారికి వ్యాక్సినేషన్‌ ‌జరుగుతుందని అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది.సెప్టెంబర్‌ 8 ‌నాటికి స్టేటస్‌ ‌రిపోర్టు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కొవిడ్‌ ‌నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్‌ ‌తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ ‌వాదనలు వినిపించారు.

ఇదిలావుంటే కరోనా కేసుల కారణంగా చిత్తేరు జిల్లాలో మూడు పాఠశాలలు మూతపడ్డాయి. బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని పల్లమాల ఉన్నత పాఠశాలలో ఓఉపాధ్యాయుడికి జరిగిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది.డీవైఈవో శేఖర్‌ ఆదేశాలతో పాఠశాలను మూసివేశారు.తరవాత పాఠశాలను పూరిస్థాయిలో శానిటైజ్‌ ‌చేయించారు. అధికారుల ఆదేశాలతో తిరిగి పాఠశాలను తెరుస్తామని చెప్పారు.సదుం మండల పరిధిలోని బూరగ మంద, కురవప్లలె ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో డీఈవో పురుషోత్తం ఆదేశాల మేరకు ఆ రెండు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసినట్లు ఎంఈవో శ్రీరాములు తెలిపారు.విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులకు కరోనా సోకడం, కరోనా థర్డ్‌వేవ్‌ ‌ప్రభావం పిల్లలపై ఎక్కువ వుంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Leave a Reply