Take a fresh look at your lifestyle.

వోటింగ్‌పై నగరవాసుల అనాసక్తి..పోలింగ్‌ ‌సెంటర్లు వెలవెల

వోటుకు దూరంగా విద్యావంతులు

చెదురుముదురు సంఘటనలు మినహా హైదరాబాద్‌ ‌నగరపాలక సంస్థకు మంగళవారం ఉద్యం పోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగిసింది. చలికాలంతో పాటు కొరోనా కాలం కావడంతో పాటు, సెలవు రావడంతో అనేకులు వోటింగ్‌కు దూరంగా ఉండడంతో పోలింగ్‌ ‌మందకొడిగా ప్రారంభమయ్యింది. వోటింగ్‌ ‌ప్రారంభంలోనే పలువురు ప్రముఖులు వోటేసినా విద్యావంతులు, ఉద్యోగులు, ఐటి ఉద్యోగులతొ పాటు ఈ సారి సామాన్యులు కూడా వొటు వేయడాంలో నిరాసర్తతను ప్రదర్శించారు. నగరంలోని పలు పోలింగ్‌ ‌కేంద్రాలలో వోటర్లు లేక వెలవెల బోయి పోలింగ్‌ ‌గంటల తరబడి చేసే పనేమి లేక కునుకు తీసే పరిస్థితి నెలకొంది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా 15శాతం పోలింగ్‌ ‌నమోదు కాకపోవడం, సాయంత్రం నాలుగు గంటలకు 30శాతం నమోదు కావడం విశేషం.

నగరంలో పోలింగ్‌ ‌శాతం పెంపుపై తీవ్రం కృషి చేసిన అధికారులకు చివరి గంటలో వోటర్లు కొన్ని పోలింగ్‌ ‌సెంటర్లకు తరలి రావడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకునారు. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్‌ను గణనీయంగా పెంచాలని గ్రేటర్‌ అధికారులు కసరత్తు చేశారు. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారిన తాజా ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారాన్ని చేపట్టాయి. అయినా వోటింగ్‌ ‌శాతం అంతంతమాత్రమే అని పోలింగ్‌ను బట్టి తేలింది.

Leave a Reply