Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ లో చేరేముందు ఆలోచించండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. గురువారం సిద్ధిపేటలో మాట్లాడుతూ…. చిల్లర డబ్బులకు ఆశపడి కొందరు నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు నమ్ముకున్న పార్టీకి ద్రోహం చేయొద్దని అన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులకే దిక్కు లేదని ఇంకా ముస్లింలకు చెందిన నాయకులు ఏ మొహం పెట్టుకొని పోతారని అన్నారు. పార్టీలు మారే కొందరు సిగ్గులేని రాజకీయ నాయకుల వల్ల రాజకీయం అంటేనే ప్రజలు నమ్మకం పోయిందని అన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే మీ అవసరం ఉంటుందని ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకునే వారే ఉండరని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచాలని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇతర పార్టీలోకి నాయకులు జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీకి పోయేదేమీ లేదని అన్నారు. ఇన్ని రోజులు పేరు సంపాదించుకొని వారి అవసరాల కోసం ఇతర పార్టీలకు వెళ్లడం మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చాలా రోజులైనా మైనార్టీ కి చెందిన నాయకుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ నుండి వస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడం సిగ్గుచేటని అన్నారు. చేరిన పార్టీ కోసమే నా న్యాయం చేయాలని మళ్లీ మనసు మార్చుకుని ఇతర పార్టీలకు వెళ్ళద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నంగునూరు మండలాధ్యక్షుడు తప్పేట శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి గ్వాదరి మధు, యువజన పట్టణ అధ్యక్షుడు గయాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply