Take a fresh look at your lifestyle.

రైతాంగ శ్రేయస్సుకు కృషి : ఎంపి

తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీరుని ఆంధ్ర తరలించుకు పోతుంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తు ఊరుకోదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పరిధిలోని నేరుడుచర్లలో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావులతో కలిసి ప్రెస్‌మీట్‌ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సిఎం కేసీఆర్‌ ఎప్పుడు తెలంగాణ రైతాంగం బాగోగుల కోసం అహర్నిశలు కృషి చేస్తుంటారని, మచ్చమర్రి ఎత్తిపోత ద్వారా అక్రమంగా తరలించు కుపోవడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు.

అనంతరం శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతు  ఆంధ్ర ప్రభుత్వం మూడు టీఎంసిల నీరును తరలించడాన్ని యావత్‌  ‌తెలంగాణ ప్రభుత్వం నిరసిస్తుందని అన్నారు. శ్రీశైలం నుండి అక్రమంగా మచ్చమర్రి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తరలించి చేయడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు.

Leave a Reply